
బాకు: ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫిడే చెస్ వరల్డ్ కప్‌లో సంచలన విజయం సాధించాడు. రెండో సీడ్, అమెరికా టాప్ ప్లేయర్ హికారు నకామురాకు షాకిస్తూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రెండు ర్యాపిడ్ గేమ్స్‌లోనూ హికారుపై ప్రజ్ఞానంద గెలిచాడు. గురువారమే 18వ బర్త్‌డే జరుపుకున్న ఇండియా యంగ్ స్టర్ హికారతో క్లాసికల్ గేమ్స్‌ను డ్రా చేసుకున్నాడు. అయితే టై బ్రేక్‌లో భాగంగా జరిగిన ర్యాపిడ్ గేమ్స్‌లో నకాముర పని పట్టాడు. నిహాల్ సరిన్ నాలుగో రౌండ్‌లో ఓడి ఇంటిదారి పట్టగా.. డి. గుకేశ్, ఎరిగైసి అర్జున్, విదిత్ గుజరాత్ ఇప్పటికే ప్రిక్వార్టర్స్ చేరారు. విమెన్స్‌లో ద్రోణవల్లి హారిక ర్యాపిడ్ టై బ్రేక్‌లో ఎలైన్ రోబర్స్‌ను ఓడించి ముందంజ వేయగా.. జార్జియా గ్రాండ్ మాస్టర్ బెల్లాతో టై బ్రేక్స్‌లో చివరి రెండు గేమ్స్‌లో ఓడిన ఇండియా నం.1 విమెన్స్ ప్లేయర్ కోనేరు హంపి నిష్క్రమించింది.