చెస్ లో భారత యువ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. నార్వే ఆటగాడు, చెస్ వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ కు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. 17 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మూడుసార్లు కార్ల్ సన్ ను ఓడించాడు. తాజాగా భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి కార్ల్ సన్ కు షాక్ ఇచ్చాడు. ఎయిర్ చెస్ రాపిడ్ ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో కార్లసన్ పై 19 ఏళ్ల అర్జున్ విజయం సాధించాడు. ఏడో రౌండ్ లో అర్జున్ 54 ఎత్తుల్లో కార్ల్ సన్ ఆట కట్టించాడు.
ఇటీవలే ఇరిగైసి జూలియ్ బేయర్ జనరేషన్ కప్ ఆన్ లైన్ టోర్నీ జరిగింది. ఇందులో కార్ల్ సన్ చేతిలో అర్జున్ ఎరిగైసి ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం కార్ల్ సన్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాడు. కార్ల్ సన్‌పై అర్జున్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్నాడు. మూడు వరుస గేమ్ లలో నైల్స్ గ్రాండెలీయస్, డానియల్ నారోడిస్కీ, కార్ల్ సన్ లను ఓడించి జాన్ క్రిజిస్టాఫ్‌తో మ్యాచ్ డ్రా చేసుకున్నాడు.
