ఒలింపిక్స్: స్పెయిన్‌పై భారత హాకీ జట్టు అద్భుతవిజయం

ఒలింపిక్స్: స్పెయిన్‌పై భారత హాకీ జట్టు అద్భుతవిజయం

ఒలిపింక్స్‌లో భారత హాకీ టీం స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది. స్పెయిన్‌తో జరిగిన పూల్‌-ఏ మూడో మ్యాచ్‌లో 3-0 తేడాతో ఇండియా విజయం సాధించింది. మంగళవారం ఉదయం స్పెయిన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలిక్వార్టర్‌ ముగిసే సరికి స్పెయిన్‌పై 2-0 గోల్స్‌‌తో భారత్‌  ఆధిక్యంలో నిలిచింది. సిమ్రన్‌జీత్ సింగ్ ఒక గోల్ చేయగా.. రూపిందర్‌సింగ్‌ రెండు గోల్స్‌తో అదరగొట్టాడు. మ్యాచ్‌లో ప్రారంభమైన 15 నిమిషాలకు ఒక గోల్, 51 నిమిషాలకు మరో గోల్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మొదటి స్పెల్‌లోనే రెండు గోల్స్ చేసిన భారత జట్టు.. రెండవ స్పెల్‌లో కొంచెం తడబడింది. రెండవ స్పెల్‌లో స్పెయిన్ ఎదురుదాడికి దిగింది. స్పెయిన్‌కు రెండు పెనాల్టీ కార్నర్స్‌ లభించినా.. భారత్ ధీటుగా ఎదుర్కొని విజయాన్ని ఒడిసిపట్టుకుంది. ఇప్పటి వరకు భారత్‌ మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో రెండింట్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 3 పాయింట్లతో మొదటిస్థానంలో నిలవగా.. రెండు పాయింట్లతో భారత్ రెండోస్థానంలో ఉంది.