భారత జిన్‌కి ప్రపంచ గుర్తింపు.. లండన్‌ పోటీల్లో గోల్డ్ మెడల్..

భారత జిన్‌కి ప్రపంచ గుర్తింపు.. లండన్‌ పోటీల్లో గోల్డ్ మెడల్..

Jin JiJi: ప్రస్తుతం సమాజంలో మద్యం సేవించటం సోషలైజ్ అయ్యింది. దీంతో చాలా మంది తరచుగా కాకపోయినా అలా ఫ్యామిలీ పార్టీలు, ఆఫీసు పార్టీల్లో సరదాగా రెండు పెగ్గులు తాగటం సర్వసాధారణంగా మారింది. అయితే ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన మద్యం గురించి ఎల్లప్పుడూ పోటీలు, డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. 

ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ రుచి కలిగిన జిన్ రకాన్ని ఎంపిక చేసేందుకు లండన్ లో పోటీలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఇండియాకు చెందిన ఒక సంస్థ కూడా పోటీలో నిలిచింది. లండన్ వేదికగా నిర్వహించిన లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్ 2025లో భారతదేశానికి చెందిన జిన్ జిజి లిక్కర్ 98 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. స్పిరిట్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను ఇది దక్కించుకుంది. 

ALSO READ | బెంగళూరులోని ఐటీ ఉద్యోగులకు శుభవార్త..!!

లండన్ లో జరిగిన పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి దాదాపు 500కి పైగా బ్రాండ్స్ ఇందులో పాల్గొన్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో తయారుచేసిన జిన్ జిజిని కొన్ని ఔషధ మెుక్కల నుంచి తయారు చేస్తారు. రుచిలో సమతుల్యత ఉండేలా భారత వారసత్వాన్ని ప్రతిబింబించేలా జిన్ జిజిని తయారు చేస్తామని పీక్ స్పిరిట్స్ కంపెనీ అధ్యక్షుడు ఆన్స్ ఖన్నా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే అనేక అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం భారతీయ బ్రాండ్ జిన్ జిజి అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో విక్రయించబడుతోంది. ఏటా లిక్కర్ ట్రేడ్ నెట్వర్క్ నిర్వహించే పోటీల్లో బ్రాండ్ల నాణ్యత, మద్యం నాణ్యత, రుచి, ఉత్పత్తి పద్ధతి, ప్యాకేజింగ్ వంటి వివిధ ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని పాయింట్లు ఇచ్చి విజేతను నిర్ణయిస్తారు.