ముంబై: అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఆశలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కారణంగా సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం ఇంట్రా-డేలో కొత్త జీవితకాల గరిష్టాలను తాకి, చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 110.87 పాయింట్లు పెరిగి 85,720.38 వద్ద స్థిరపడింది.
ఇంట్రా-డేలో 86,055.86 రికార్డు గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.25 పాయింట్లు పెరిగి 26,215.55 వద్ద సెటిలయ్యింది. ఇది 26,310.45 వద్ద కొత్త రికార్డును తాకింది. సెన్సెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభపడ్డాయి. ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లు పుంజుకున్నాయి. ఎఫ్ఐఐలు రూ.4,778.03 కోట్లు, డీఐఐలు రూ.6,247.93 కోట్లు విలువైన షేర్లను కొన్నారు.
