
జకర్తా: ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియా మెన్స్ టీమ్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ సెకండ్ లీగ్ మ్యాచ్‌లో 2–5తో జపాన్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో నాకౌట్ ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇండోనేసియాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో నెగ్గినా.. అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇండియా తరఫున రాజ్‌బహర్ పవన్ (44వ ని.), ఉత్తమ్ సింగ్ (49వ ని.) గోల్స్ చేయగా, కెన్ నగయోషి (23వ ని.), కవాబి కోసి (39, 55వ ని.), యమసకి కొజి (54వ ని.), ఊకా రయోమ (48వ ని.) జపాన్‌కు గోల్స్ అందించారు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమిండియా... ఈ పోరులో అనుభవలేమితో ఇబ్బందిపడింది.