హిందూయిజానికి నిర్వచనం చెప్పిన ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్

హిందూయిజానికి నిర్వచనం చెప్పిన ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్

న్యూఢిల్లీ: భారతదేశానికి అవసరం వచ్చిన ప్రతిసారి అన్ని విశ్వాసాల ప్రజలు కలసి నిలబడ్డారని ఆర్‌‌ఎస్‌‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. భారతీయ ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆయన చెప్పారు. ఒక దేశాన్ని పాలించిన విదేశీ మతం ఆ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉనికిలో ఉండటం భారత్‌‌లో తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొఘల్ చక్రవర్తి అక్బర్‌‌తో యుద్ధంలో మేవార్ రాజు మహారాణా ప్రతాప్ ఆర్మీలో చాలా సంఖ్యలో ముస్లింలు పాల్గొని పోరాడారని భగవత్ గుర్తు చేశారు. దేశ సంస్కృతిపై దాడి జరిగినప్పుడల్లా అన్ని విశ్వాసాల ప్రజలు ఒక్కటై ఎదురు నిలిచారన్నారు.

భారత్‌‌లా కాకుండా దాయాది పాకిస్తాన్ ఇతర మతాలను పాటించే వారికి తమ దేశంలో సరైన హక్కులు కల్పించడం లేదని భగవత్ మండిపడ్డారు. పాక్ కేవలం ముస్లింల కోసం ఏర్పడిన దేశమనన్నారు. ‘ఇక్కడ కేవలం హిందువులే జీవించాలని మన రాజ్యాంగం చెప్పదు. కానీ ఇక మీదట ఇక్కడ హిందువులు చెప్పిందే వినాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఉండాలనుకుంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాలి. ఇక్కడ మనం అందరికీ చోటు కల్పించాం. ఇదే మన దేశ స్వభావం. ఈ స్వాభావిక లక్షణాన్నే హిందూయిజం అంటారు’ అని మహారాష్ట్రలోని వివేక్ అనే హిందీ మేగజీన్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భగవత్ వివరించారు. స్వలాభం కోసం ప్రభావితమయ్యే వారు మాత్రమే మూర్ఖత్వాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తారన్నారు.