ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే

ఇండియన్ నేవీ వివిధ విభాగాలలో ఛార్జ్‌మెన్ 2 పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు మే 29, 2023లోపు joinindiannavy.gov.inలో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఛార్జిమెన్ 2 పోస్టుకు మొత్తం 372 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్క్రీనింగ్, కంప్యూటర్ ఆధారిత పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు అర్హత ప్రమాణాలు, పే స్కేల్, ఇతర వివరాలను ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు.

 ఖాళీలు

  •     ఎలక్ట్రికల్ గ్రూప్- 42 పోస్టులు
  •     వెపన్ గ్రూప్- 59 పోస్టులు
  •     ఇంజినీరింగ్ గ్రూప్-141 పోస్టులు
  •     కన్స్ట్రక్షన్ & మెయింటెనెన్స్ గ్రూప్ - 118 పోస్ట్‌లు
  •     ప్రొడక్షన్ ప్లానింగ్ & కంట్రోల్ గ్రూప్-12 పోస్ట్‌లు

అర్హతలు:

అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్‌తో సైన్స్‌లో డిగ్రీని కలిగి ఉండాలి లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి తగిన విభాగంలో ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండాలి.

వయోపరిమితి:

18-25 సంవత్సరాలు (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది)

ఎంపిక ప్రమాణాలు

దరఖాస్తుల స్క్రీనింగ్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

పే స్కేల్

జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ 'బి' నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, పే స్కేల్- లెవెల్-6 (రూ.35400-112400)  

ఎలా అప్లై చేసుకోవాలంటే..

  • ముందుగా joinindiannavy.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • Join Navy >> Ways to Join >> Civilian >> Chargeman – II పై క్లిక్ చేయండి.
  • ముందుగా, అభ్యర్థి అవసరమైన వివరాలను పూరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అది విజయవంతమైన తర్వాత, అభ్యర్థికి యూజర్ ఐడీ & పాస్‌వర్డ్ ఆన్ సెండ్ అవుతుంది.
  • నమోదు చేయబడిన ఇమెయిల్.. అప్లికేషన్ పూరించడానికి లాగిన్ చేయడానికి ఉపయోగపడుతుంది.
  • అభ్యర్థి మెట్రిక్యులేషన్/సెకండరీ స్కూల్ సర్టిఫికెట్లలో ఇచ్చిన విధంగా వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు & తల్లి పేరు తప్పనిసరిగా నింపాలి.
  • అభ్యర్థులు వారి స్వంత మొబైల్ నంబర్ లేదా చెల్లుబాటు అయ్యే & క్రియాశీల వ్యక్తిగత ఇమెయిల్ ఐడీని ఫిల్ చేసి, సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి, రుసుము చెల్లించండి.
  • ఫైనల్ గా పేజీని ఓకే చేసి, డౌన్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుము

అభ్యర్థులు ఈ దరఖాస్తు కోసం రూ.278 + ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.