భారత్ అమ్ములపొదిలో మరో ఆయుధం.. త్వరలో నేవీ చేతికి INS అరిధామన్

భారత్ అమ్ములపొదిలో మరో ఆయుధం.. త్వరలో నేవీ చేతికి INS అరిధామన్

భారత్ అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరబోతోంది.  వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఆర్మీకి చేతికి మరో కొత్త ఆయుధం అందిస్తోంది. భారత్ తన మూడో అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి INS అరిధమాన్‌ను త్వరలో కమిషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ATV ప్రాజెక్టులో భాగంగా INS అరిధమాన్ ను నిర్మించారు. 

భారత నేవీలో మూడో స్వదేశీ అణుశక్తి జలాంతర్గామి INS అరిధమాన్ ను త్వరలో కమిషన్ చేయనున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు. నీటి అడుగులో దాడి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందన్నారు. అణు నిరోధక వ్యూహాన్ని మరింత పెంచుతుందన్నారు.  దేశీయ అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆగస్టులో విశాఖపట్నంలో రెండో SSBN INS అరిఘాట్‌ను ఆర్మీకి అప్పగించారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. 

INS అరిధమాన్ అధికారికంగా నౌకాదళంలో చేరిన తర్వాత. భారతదేశం ముఖ్యమైన వ్యూహాత్మక మైలురాయిని చేరుకుంటుంది. సముద్రంలో మొదటిసారిగా మూడు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు తమ అణుశక్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. 

INS అరిధమాన్ గురించి..

భారత నౌకాదళానికి చెందిన అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అరిధమాన్. ఇది అరిహంత్-తరగతిలో మూడోది. S4 వ్యూహాత్మక అణు జలాంతర్గామి. ఇది అణుశక్తితో నడిచే జలామతర్గాముల శక్తి ని మరింత బలోపేతం చేస్తుంది. ఇది భారత్ వ్యూహాత్మక రక్షణ వ్యవస్థలో స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 

►ALSO READ | బీహార్ అసెంబ్లీ స్పీకర్‎గా బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్

అణుశక్తి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి INS అరిధమాన్‌ను ద్వారా తన వ్యూహాత్మక నిరోధక శక్తిని బలోపేతం చేయనుంది. ఇది దేశ నావికా ,అణు సామర్థ్యాలలో కీలక మైలురాయిని సూచిస్తుంది. సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు  INS అరిధాన్ ను రూపొందించారు.