భారత యుద్దనౌక INS ఇంఫాల్: తొలి బ్రహ్మోస్ క్షిపణి కాల్పులు సక్సెస్

భారత యుద్దనౌక INS ఇంఫాల్: తొలి బ్రహ్మోస్ క్షిపణి కాల్పులు సక్సెస్

భారత నౌకాదళానికి చెందిన తాజా స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక INS ఇంఫాల్.. సముద్రంలో విజయవంతంగా తొలి బ్రహ్మోస్ క్షిపణి కాల్పులను జరిపి బుల్స్ ఐని తాకింది.ఇది భారత నౌకాదళానికి ముఖ్యమైన  మైలురాయి. ఈ నౌక ప్రారంభానికి ముందే నిర్వహించిన సక్సెస్ ఫుల్ టెస్ట్. పోరాటానికి సంసిద్ధత, నావికాదళ ధృఢత్వానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. సముద్రంలో నావికాదళ పరాక్రమాన్ని పెంచుతోంది. 

ఇంఫాల్.. విశాఖపట్నం  క్లాస్ స్టైల్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ లలో ఇది మూడవ నౌక. స్వదేశీ నౌకా నిర్మాణానికి ఇది నిదర్శనం..ఇండియన్ నావీ వార్ షిప్ డిజైన్ బ్యూరో చేత రూపొందించబడి.. ముంబైలోని మజాగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. ins ఇంఫాల్.. లేటెస్ట్ టెక్నాలజీ,స్వదేశీ ఆవిష్కరణల కలయికకు అద్దంపడుతుంది. 

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఇంఫాల్ యుద్దంలో పోరాడిన భారత సైనికుల గౌరవార్థం యుద్ద నౌకకు ఇంఫాల్అని పేరు పెట్టారు. స్థితిస్థాపకత, శక్తికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. 7వేల400 టన్నుల బరువు, 164 మీటర్ల పొడవుతో శక్తివంతమైన స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ INS ఇంఫాల్. దానిలో అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ఉపరితలం నుంచి గగన తలానికి ప్రయోగించే క్షిపణులు, యాంటీ నౌక క్షిపణులు, టార్పెడోలు ఉంటాయి.