ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులకు దరఖాస్తులు

ఫ్లోరెన్స్ నైటింగేల్  అవార్డులకు దరఖాస్తులు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులకు ఇచ్చే ‘ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డు’ల కోసం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్సీ) దరఖాస్తులను ఆహ్వానించింది. 2026వ సంవత్సరానికి గాను ఈ పురస్కారాలను అందించనున్నారు. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు, ప్రైవేట్, మిషనరీ, స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది ఈ అవార్డులకు అర్హులు. 

పురస్కారం కింద రూ. లక్ష నగదు, ఒక పతకం, ప్రశంసాపత్రం అందిస్తారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 12న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అర్హులైన అభ్యర్థులు తమ నామినేషన్లను రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ సిఫార్సుతో 2026 జనవరి 31వ తేదీలోగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షుడికి పంపాల్సి ఉంటుంది.