రష్యా చమురు సప్లై ఆగదన్న ఐఓసీ

రష్యా చమురు సప్లై ఆగదన్న ఐఓసీ

న్యూఢిల్లీ: ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ) సహా ఇతర భారతీయ ఆయిల్​కంపెనీలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను పూర్తిగా ఆపకపోవచ్చని తెలుస్తోంది. ఇటీవల అమెరికా కొన్ని రష్యన్ కంపెనీలపై ఆంక్షలు విధించింది.​ దీంతో ఇండియా కంపెనీలు కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం ప్రస్తుతానికి నిలిపివేశాయి. 

అయితే,  ఆంక్షలు లేని సంస్థల ద్వారా చమురు సరఫరా కొనసాగే అవకాశం ఉందని ఐఓసీ వర్గాలు తెలిపాయి. రష్యా చమురు సరఫరాలో దాదాపు 45 శాతం వాటా గల రోస్‌‌‌‌నెఫ్ట్‌‌‌‌పై ఆంక్షలు ఉన్నాయి. రోస్‌‌‌‌నెఫ్ట్​ నిజమైన ఉత్పత్తిదారు కాదని, అగ్రిగేటర్​ మాత్రమేనని అధికారులు తెలిపారు.  ఆంక్షలు లేని సంస్థలు ముడి చమురును సేకరించి ఇండియాకు సరఫరా చేయవచ్చని పేర్కొన్నారు.