ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ మార్జిన్లు పెరిగాయ్

ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ మార్జిన్లు పెరిగాయ్

న్యూఢిల్లీ : ఫ్యూయెల్ మార్కెటింగ్, రిఫైనింగ్​లలో మార్జిన్లు పెరగడంతో ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​(ఐఓసీ) నికరలాభం మార్చి 2023 క్వార్టర్లో 67 శాతం పెరిగి రూ. 10,058.69 కోట్లకి చేరింది.  2021–22 మార్చి క్వార్టర్లో ఐఓసీ నికరలాభం రూ. 6,021.88 కోట్లే. నాలుగో క్వార్టర్లో లాభం బాగా పెరగడంతో పూర్తి ఫైనాన్షియల్​ ఇయర్​కు కూడా ఐఓసీ లాభాల్లోకి రాగలిగింది. 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్​కు ఐఓసీ రూ. 8,241.82 కోట్ల నికరలాభం ప్రకటించింది.

పెట్రోల్​, డీజిల్​, ఎల్​పీజీ రేట్లను పెంచకపోవడం వల్ల 2022–23 ఫైనాన్షియల్​ ఇయర్​ మొదటి ఆరు నెలల్లో ఐఓసీకి నష్టాలే వచ్చాయి. పెట్రోల్​, డీజిల్​ రేట్లను ఇప్పటికీ పెరగకుండానే చూస్తున్నప్పటికీ, గ్లోబల్​గా క్రూడ్​ రేట్లు తగ్గడం   కలిసి వచ్చింది. కిందటేడాది ఏప్రిల్​6 నుంచి ఇప్పటిదాకా దేశంలో పెట్రో రేట్లను పెంచలేదు.   క్రూడాయిల్​ బ్యారెల్ ధర​ ఈ ఏడాది ఏప్రిల్​లో 100 డాలర్ల దాకా ఉండగా, ఇప్పుడు 75 డాలర్లకు తగ్గింది.