నాసా హెలికాప్టర్ కు భారత సంతతి స్టూడెంట్ సూచించిన పేరు

నాసా హెలికాప్టర్ కు భారత సంతతి స్టూడెంట్ సూచించిన పేరు

మార్స్‌లో ప్రయాణించనున్న నాసా హెలికాప్టర్ కు భారత సంతతికి చెందిన అమ్మాయి సూచించిన పేరు పెట్టారు శాస్త్రవెత్తలు. ఈ ఘనత 17ఏళ్ల వనీజా రూపానీకి దక్కింది. అమెరికాలోని అలబామాలోని నార్త్ పోర్ట్ కు చెందిన స్కూల్ లో ఎంఎస్ రూపానీ 12వ తరగతి చదువుతుంది. అయితే ‘నేమ్ ది రోవర్’ పోటీలో తన వ్యాసాన్ని రాసింది రూపానీ. ఆ పోటీలో ఆమె రాసిన వ్యాసం మొదటగా నిలిచింది దీంతో రూపానీ సూచించిన పేరును హెలికాప్టర్‌కు పెట్టారు. ఆమె ఆ హెలికాప్టర్‌కు ‘చాతుర్యం’ అనే పేరును సూచించింది.

నాసా యెక్క తదుపరి రోవర్‌కు కూడా పేరును ఫైనల్ చేశారు శాస్త్రవెత్తలు. ఏడవతరగతి చదువుతున్న అలెగ్జాండర్ మాథర్ యొక్క వ్యాసం ఆధారంగా.. ఆ రోవర్ కు పట్టుదల అని పేరు పెట్టినట్టు చెప్పారు.

అమెరికాలో K12  చదువుతున్న పిల్లలలో 28వేల మంది విధ్యార్థులు ‘నేమ్ ది రోవర్’ కోసం వ్యాసాలు పంపగా… రూపానీ రాసిన వ్యాసం ఫైనల్ అయిందని బుధవారం చెప్పింది నాసా.  అంతరిక్ష ప్రయాణ సవాళ్లను అదిగమించడానికి కష్టపడి పనిచేసే ప్రజల ‘చాతుర్యం’ మరియు ప్రకాశం మనందరినీ అందరిక్ష పరిశోధన యొక్క అద్భుతాలను అనుభవించడానికి వీలు కల్పిస్తాయని రూపానీ తన వ్యాసంలో రాసినట్టు నాసా తెలిపింది. ‘చాతుర్యం’ అనేది మనుషులతో అద్భుతమైన పనులను చేయిస్తుందని.. ఇది విశ్వం యొక్క అంచులకు కూడా తీసుకెళుతుందని రూపాని తెలిపింది.

ఎంఎస్ రూపానీకి చిన్నప్పటి నుంచే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ఉన్నట్లు తెలిపారు ఆమె తల్లి నౌషీన్ రూపానీ. ప్రతీరోజు స్కూల్‌కు వెళ్లేటప్పుడు ఆమె మరియూ ఆమె తండ్రి వారి కారును అంతరిక్షనౌక అని అనుకుంటారని తెలిపారు. రోడ్డు పక్కన ఉండే భవనాలను గ్రహాలు అని, ట్రాఫిక్ సిగ్నల్స్ ను నక్షత్రాలు అని ఊహించుకుంటారని చెప్పారు.

‘చాతుర్యం’, ‘పట్టుదల’ జులైలో ప్రారంభించబడుతాయని తెలిపింది నాసా. వచ్చే ఫిబ్రవరిలో 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న సరస్సు వద్ద దిగనున్నాయని వారు చెప్పారు. రోవర్ మార్స్ యొక్క నమూనాలను సేకరిస్తుండగా, హెలికాప్టర్ ఎగురుతుందని.. ఆ ప్రయత్నం విజయవంతమైతే భవిష్యత్తులో మార్స్ మిషన్ లలో వైమానిక కోణాన్ని మరింత పెంచే అవకాశాలు ఉంటాయని నాసా తెలిపింది.