విమానంలోని సీట్లోనే.. చనిపోయిన 24 ఏళ్ల భారతీయ యువతి

విమానంలోని సీట్లోనే.. చనిపోయిన 24 ఏళ్ల భారతీయ యువతి

ఆమె పేరు మన్ ప్రీత్ కౌర్.. వయస్సు 24 ఏళ్లు.. ఇండియా అమ్మాయి.. ఆస్ట్రేలియా వెళ్లి నాలుగేళ్లు అవుతుంది.. నాలుగేళ్ల తర్వాత ఇండియాలోని తల్లిదండ్రులను చూడ్డానికి మెల్ బోర్న్ నుంచి బయలుదేరింది. టికెట్ తీసుకుని విమానం ఎక్కింది.. విమానంలోని సీట్లో కూర్చుంది. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ అలాగే కుప్పకూలింది. ఫ్లయిట్ సిబ్బంది ఎమర్జెన్సీ వైద్య సాయం అందించినా ఫలితం లేదు.. అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.

కౌర్ మరణానికి టీబీ కారణమని తెలుస్తోంది. టీబీ కారణంగా లంగ్స్ పాడయ్యి మరణించిందని నిర్దారించారు డాక్టర్లు. అత్యంత విషాధ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే...ఆస్ట్రేలియాలో కుకింగ్ కోర్స్ చేస్తున్న మన్ ప్రీత్ కౌర్, క్లాసెస్ అయిపోయాక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేది.

చెఫ్ అవ్వాలన్న గోల్ తో 2020లో ఆస్ట్రేలియాకు వెళ్ళింది కౌర్. నాలుగేళ్ళ తర్వాత తన కుటుంబాన్ని చూడటం కోసం కొర్ ఇండియా బయలుదేరగా ఈ దారుణం చోటు చేసుకుంది. కౌర్ అందరితో సన్నిహితంగా ఉండెదని, ఇండియాకి బయలుదేరే ముందు కూడా తన స్నేహితులతో కలిసి విక్టోరియాలో ట్రావెల్ చేసి ఆనందంగా గడిపిందని తన రూమ్మేట్ కుల్దీప్ చెప్పుకొచ్చారు. కౌర్ మరణం తర్వాత తన ఫ్రెండ్స్ అంత కలిసి గో ఫండ్ మీ అనే పేజీ క్రియేట్ చేసి తన కుటుంబాన్న సహాయం చేశారు.