విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

నెట్‌‌ఫ్లిక్స్‌‌, అమెజాన్‌‌ ప్రైమ్‌‌ వీడియోలకు పోటీ

పశ్చిమాసియాలో మంచి ఆదరణ

తెలుగు, హిందీ, తమిళ్  సినిమాలకు క్రేజ్‌‌

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఓటీటీ(ఓవర్‌‌‌‌‌‌‌‌ దీ టాప్‌‌‌‌)  సర్వీసులు విపరీతంగా పాపులర్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. ఇండియాలో అమెరికన్‌‌‌‌  ఓటీటీ సర్వీస్‌‌‌‌లు నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌, అమెజాన్‌‌‌‌ ప్రైమ్‌‌‌‌ వీడియో వంటివి బాగా ఫేమస్‌‌‌‌ అయ్యాయి. వీటితో పోటీ పడుతూనే ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులు విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్‌‌‌‌, కంటెంట్‌‌‌‌లను ఆఫర్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఇండియా వెలుపల కూడా ఫేమస్‌‌‌‌ అవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులకు మంచి ఆదరణ దక్కుతోంది.   ఈ దేశాలలో  మొత్తం ఓటీటీ వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లో  25 శాతం వరకు వాటాను మన ఓటీటీలు దక్కించుకుంటున్నాయి. పశ్చిమాసియా దేశాల్లో ఇండియన్స్‌‌‌‌ కూడా ఎక్కువగానే ఉంటారు. వీరిని ఆకర్షించడంతో పాటు పాకిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌ వంటి పొరుగు దేశాలకు చెందిన వ్యూయర్స్‌‌‌‌ను ఆకర్షించడానికి ఓటీటీలు కంటెంట్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నాయి.

ఇప్పటికే జీ5, ఆల్ట్‌‌‌‌బాలాజి, ఈరోస్‌‌‌‌ నౌ, హంగామా ప్లే వంటి ఓటీటీ సర్వీసులు ఇండియన్‌‌‌‌ బోర్డర్‌‌‌‌‌‌‌‌ దాటి ఆదరణ పొందుతున్నాయి.  అమెరికా, ఇంగ్లండ్‌‌‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌, సౌతాఫ్రికా వంటి దేశాలలో ఈ సర్వీసులకు మంచి వ్యూవర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ఉంది.  హిందీ, తమిళ, తెలుగు సినిమాలు ఈ దేశాలలో మంచి ఆదరణ లభిస్తోంది. షారుక్‌‌‌‌ ఖాన్‌‌‌‌, రజనీకాంత్‌‌‌‌, చిరంజీవి, ఎన్టీఆర్​, ప్రభాస్​, మహేశ్​బాబు, పవన్​కల్యాణ్​​వంటి పెద్ద స్టార్ల సినిమాలు ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులకు కాసులు కురిపిస్తున్నాయి.  పశ్చిమాసియా దేశాలలో డిజిటల్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ ఎకోసిస్టమ్‌‌‌‌ వేగంగా విస్తరిస్తోందని ఈరోస్‌‌‌‌ నౌ చీఫ్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అలి హుస్సేన్‌‌‌‌ అన్నారు. దీంతో  ఓటీటీ సర్వీసులు మరింతగా విస్తరించడానికి అవకాశం దొరుకుతోందని చెప్పారు. ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులు హింది, తమిళ్‌‌‌‌, తెలుగు, మలయాళం సినిమాలు, షోలు, వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లను  డబ్బింగ్‌‌‌‌ లేదా సబ్‌‌‌‌టైటిల్స్‌‌‌‌తోనో వ్యూవర్స్‌‌‌‌కు అందిస్తున్నాయి.

ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌లో ఉంటున్న ఇండియన్స్‌‌‌‌ను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌ వాసులనూ కూడా ఆకర్షించేందుకు ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీసులు ప్రయత్నాలు చేస్తున్నాయి.  జోధా అక్బర్‌‌‌‌‌‌‌‌, తినయాని, కుబుల్‌‌‌‌ హై వంటి షోలను జీ 5 ముఖ్యంగా వీరి కోసం అందుబాటులోకి తెచ్చింది. బంగ్లాదేశ్‌‌‌‌ ఆడియన్స్‌‌‌‌ను ఆకర్షించేందుకు  హంగామా ప్లే, బెంగాలి ప్రొడక్షన్‌‌‌‌ హౌస్‌‌‌‌ శ్రీ వెంకటేష్‌‌‌‌ ఫిల్మ్స్‌‌‌‌తో  టై అప్‌‌‌‌ అయ్యి పాపులర్‌‌‌‌‌‌‌‌ బెంగాల్‌‌‌‌ షోలను అందిస్తోంది. ఇండియన్‌‌‌‌ ఓటీటీ సర్వీస్‌‌‌‌లు లోకల్‌‌‌‌ కంపెనీలతో స్ట్రాటజిక్‌‌‌‌ పార్టనర్‌‌‌‌‌‌‌‌ షిప్స్‌‌‌‌ను కూడా కుదుర్చుకుంటున్నాయి.

ఈరోస్‌‌‌‌ నౌ, వోడాఫోన్ ఖతర్‌‌‌‌‌‌‌‌తో టై అప్‌‌‌‌ అయ్యింది. ఇంగ్లండ్‌‌‌‌కి చెందిన టీవీ, బ్రాడ్‌‌‌‌ బ్యాండ్‌‌‌‌ కంపెనీ వర్జిన్‌‌‌‌ మీడియాతో కలిసి ఓ డీల్‌‌‌‌ కుదుర్చుకుంది. ఈ డీల్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌లోని వర్జిన్‌‌‌‌ టీవీ కస్టమర్లు ఈరోస్‌‌‌‌ నౌ లోని సినిమాలు, ఒరిజినల్‌‌‌‌ వెబ్‌‌‌‌ సిరీస్‌‌‌‌లు, మ్యూజిక్‌‌‌‌, షార్ట్‌‌‌‌ ఫార్మెట్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ను యాక్సెస్‌‌‌‌ చేసుకోవడానికి వీలుంటుంది. ఓవర్‌‌‌‌‌‌‌‌సిస్‌‌‌‌లో ప్రకటనలు ఇవ్వడానికి ఎక్కువగా ఖర్చు చేయాలని ఆల్ట్‌‌‌‌బాలాజి సీఈఓ నచికేత్‌‌‌‌ పంత్‌‌‌‌ వైద్య అన్నారు.  కంటెంట్‌‌‌‌ను కస్టమైజ్‌‌‌‌ చేయాల్సి ఉంటుందని, ఈ కంటెంట్‌‌‌‌ లోకల్‌‌‌‌ చట్టాలకు అనుగుణంగా ఉండాలని అన్నారు. ఇక్కడి వారు ఓటీటీ సర్వీసులను అఫోర్డ్‌‌‌‌ చేయగలరని అన్నారు. బాలాజి టెలి ఫిల్మ్స్‌‌‌‌ ఒరిజినల్‌‌‌‌ డ్రామా కంటెంట్‌‌‌‌ పశ్చిమ ఆసియాలోని 20–40 మధ్య వయుసున్న ఫిమేల్‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌లో మంచి ఆదరణ దక్కించుకుంటోంది.

బాలీవుడ్‌‌‌‌ సినిమాలకు మస్తు గిరాకి

ఇంటర్నేషనల్‌‌‌‌గా బాలివుడ్‌‌‌‌ సినిమాలకు మంచి గిరాకి ఉంటోందని జీ5 గ్లోబల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ బిజినెస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ అర్చన ఆనంద్‌‌‌‌ అన్నారు. తాజాగా సింబా, శాండి కి ఆంఖ్‌‌‌‌, డ్రీమ్‌‌‌‌ గర్ల్‌‌‌‌ వంటి సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పారు. మిడిల్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ దేశాలలో ఇండియన్లూ ఎక్కువగానే ఉంటారు. వీరి కోసం హిందితో పాటు తమిళం​, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలను కూడా అందుబాటులో ఉంచామని అర్చన చెప్పారు. సరిగమప కేరళం, చంబరతి, పువే పుచుడవ వంటి సౌత్‌‌‌‌ ఇండియన్‌‌‌‌ సినిమాలను అందిస్తున్నామని అన్నారు.

For More News..

గ్రేటర్‌లో వారంలో 199 కేసులు నమోదు

12 గంటల్లో 43 ట్రైన్స్‌‌తో రికార్డు

మరో ఐదురోజులు వడగాడ్పులు