దూసుకెళ్లిన ఫార్మా మార్కెట్.. గత నెల రూ.20 వేల కోట్ల అమ్మకాలు

దూసుకెళ్లిన ఫార్మా మార్కెట్.. గత నెల రూ.20 వేల కోట్ల అమ్మకాలు
  • సీఎన్​ఎస్ విభాగంలో భారీ గ్రోత్​
  • మేలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు

న్యూఢిల్లీ: భారత ఫార్మా మార్కెట్ గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి ఆగస్టులో 8.1 శాతం వృద్ధి సాధించింది. జులై నెలలో 7.1 శాతం వృద్ధి తర్వాత ఇది నమోదైంది. హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ సెక్యూరిటీస్,  ఐక్యూవియా రిపోర్టుల ప్రకారం..2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం చూస్తే ఇది 8 శాతం వృద్ధికి దగ్గరగా ఉంది. అయితే, ఆగస్టు నెలలో అమ్మకాలు 0.8 శాతం తగ్గాయి. 

ఫార్మాట్రాక్ ఇండస్ట్రీ రిపోర్ట్ ప్రకారం, భారత ఫార్మా మార్కెట్ ఆగస్టు 2025లో 8.7 శాతం పెరిగింది. మొత్తం అమ్మకాల విలువ రూ. 20,984 కోట్లుగా నమోదైంది. గుండె జబ్బులు, యాంటీ-–డయాబెటిక్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ (సీఎన్​ఎస్​) లాంటి దీర్ఘకాలిక చికిత్సల మందుల అమ్మకాల వల్ల ఫార్మా సెక్టార్​ పనితీరు  మెరుగుపడింది. రెస్పిరేటరీ, క్యాన్సర్ మందులకు డిమాండ్ బాగా పెరిగింది.   

యాంటీ-ఇన్ఫెక్టివ్స్, గ్యాస్ట్రోఇంటెస్టినల్ మందులకు డిమాండ్ మందకొడిగా ఉంది. ఆగస్టులో దీర్ఘకాలిక మందుల సేల్స్​12 శాతం, సాధారణ మందుల సేల్స్​ 6 శాతం పెరిగాయి. గుండె జబ్బులు, యాంటీ-డయాబెటిక్ మందులు రెండూ 11 శాతం పెరిగాయి. దీనికి జీఎల్​పీ-1 మాలిక్యూల్స్ బలమైన విక్రయాలు కారణం. సీఎన్ఎస్ మందుల అమ్మకాలు 8 శాతం పెరిగాయి. 

సాధారణ కేటగిరీలలో, యాంటీ-ఇన్ఫెక్టివ్స్ 6 శాతం, గ్యాస్ట్రోఇంటెస్టినల్ మందులు 2 శాతం, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియెంట్స్ (వీఎంఎన్​) 7 శాతం పెరిగాయి. రెస్పిరేటరీ మందులు 19 శాతం, ఆంకాలజీ మందుల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. నొప్పులకు వాడే మందుల సేల్స్​ 6 శాతం పెరిగాయి.  బీపీ, షుగర్​ షేషెంట్లు వాడే గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 (జీఎల్​పీ-1) డ్రగ్స్​ విక్రయాలు ఆగస్టులో 97 శాతం పెరగడం ఈ రంగంలో ముఖ్యమైన పరిణామం. ఇవి యాంటీ-డయాబెటిక్ వృద్ధికి కీలకంగా మారాయి.