కోహ్లీసేనకు 3 వారాల బ్రేక్‌‌‌‌

కోహ్లీసేనకు 3 వారాల బ్రేక్‌‌‌‌


లండన్‌‌‌‌: టీమిండియా క్రికెటర్లకు గుడ్‌‌‌‌ న్యూస్‌‌‌‌. వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ తర్వాత ఆటగాళ్లకు మూడు వారాల బ్రేక్‌‌‌‌ ఇవ్వాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ నిర్ణయించింది. ఎక్కువ కాలం బయో బబుల్‌‌‌‌లో ఉండటం వల్ల  ఎదురయ్యే మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు నెలల లాంగ్‌‌‌‌ టూర్​ కోసం యూకే వెళ్లిన  టీమిండియా.. ఈ నెల 18–-22 మధ్య సౌతాంప్టన్‌‌‌‌ వేదికగా  డబ్ల్యూటీసీ ఫైనల్లో పోటీపడుతుంది. ఈ పోరు ముగిసిన వెంటనే క్రికెటర్లందరూ మూడు వారాల (20 రోజులు)  బ్రేక్‌‌‌‌ను ఎంజాయ్‌‌‌‌ చేయనున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా జులై 14న తిరిగి ఒక్క చోటుకు చేరుతారు.  ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే సిరీస్‌‌‌‌కు ప్రిపరేషన్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేస్తారు.  కాగా, బ్రేక్‌‌‌‌ టైమ్​లో ఆటగాళ్లు యూకేలో ఎక్కడికైనా వెళ్లవచ్చని బీసీసీఐ సీనియర్​ అధికారి ఒకరు చెప్పారు. సహజంగానే టీమ్‌‌‌‌ గెట్‌‌‌‌- టుగెదర్స్‌‌‌‌ ఉన్నప్పటికీ.. ఈ సమయాన్ని ఆటగాళ్లు తమ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకునే స్వేచ్ఛ ఇస్తారని తెలుస్తోంది. 

కోహ్లీ, శాస్త్రి కోరినందుకే..

ఇంగ్లండ్‌‌‌‌ టూర్​కు వెళ్లేముందు ముంబైలో జరిగిన ప్రెస్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌లో కెప్టెన్‌‌‌‌ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి.. మెంటల్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఇష్యూపై మాట్లాడారు. ఎక్కువ కాలం  బబుల్‌‌‌‌లో ఉంటే మానసిక సమస్యలు వస్తాయని కోహ్లీ చెప్పాడు. అందువల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌ మధ్యలో కొంత విరామం ఇస్తే బాగుంటుందని మేనేజ్​మెంట్​కు సూచించాడు.రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో టీమ్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌.. ఈ లాంగ్‌‌‌‌ టూర్​లో ఆటగాళ్లకు బ్రేక్‌‌‌‌ ఇవ్వాలని డిసైడ్​ అయ్యింది.