
హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నగరానికి మరో రెండు వందే భారత్ కొత్త రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికే నాగ్పూర్ నుంచి హైదరాబాద్ సిటీకి వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది. అయితే కొత్త వందే భారత్ సర్వీస్ హైదరాబాద్ టూ పుణె, సికింద్రాబాద్ టూ నాందేడ్ మధ్య మొదలు కానుందని తెలిసింది.
ఈ రెండు రైళ్లు అందుబాటులోకి వస్తే.. వీటిలో ఒక వందే భారత్ రైలు.. సికింద్రాబాద్ నుంచి పుణె మధ్య ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో రాకపోకలు సాగించే అవకాశం ఉంది. వారంలో ఆరు రోజులు శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తోంది. ఈ రైలు మొత్తం 13 కోచ్లతో ఉంది. వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏసీ కోచ్లు, తొమ్మిది ఏసీ చైర్ కార్ కోచ్లు, రెండు EOG కోచ్లు కావడం గమనార్హం.
అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నుంచి పలు రూట్లలో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ దక్కుతుండటంతో మరో రెండు వందే భారత్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి మొత్తం నాలుగు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, యశ్వంత్ పూర్, నాగ్ పూర్ నగరాలకు నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో.. నాగ్పూర్ నడిచే వందే భారత్ రైలుకు 8 కోచ్లు, విశాఖపట్నం, సికింద్రాబాద్ల మధ్య నడిచే వందేభారత్20 కోచ్లతో నడుస్తున్నాయి. సికింద్రాబాద్, తిరుపతి మధ్య నడిచే వందే భారత్ 16 కోచ్లతో నడుపుతున్నారు.