పిల్లలపై ప్రేమతో దివాళా తీస్తున్న రిటైర్డ్ పేరెంట్స్ : ATMలా వాడేస్తున్న కొడుకులు, కూతుళ్లు!

పిల్లలపై ప్రేమతో దివాళా తీస్తున్న రిటైర్డ్ పేరెంట్స్ : ATMలా వాడేస్తున్న కొడుకులు, కూతుళ్లు!

ఇప్పుడు మనం జీవిస్తున్నది ఆధునిక ప్రపంచంలో. ఇక్కడ వేగం చాలా ముఖ్యం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేనివారు ఖచ్చితంగా వెనకపడిపోవటం ఖాయం. ఆదాయపరంగా లేదా ఆలోచనల పరంగా, వృత్తి-వ్యాపారం దేనిలోనైనా ప్రస్తుతం సమాజంలో వాస్తవానికి అవసరానికి మధ్య వ్యత్యాసం పెరిగిపోయింది. ఈ జీవిత పరుగుపందెంలో గెలిచేందుకు చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ఏటీఎంలుగా వాడేస్తున్నారు. అసలు తమ ఆలోచనలు ఫెయిల్ అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటనే విషయాలపై భారత కుంటుంబాలు ఆలోచించకపోవటం పెద్ద ప్రమాదకరంగా మారిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో రిటైర్ట్ ఉద్యోగులు తమ వారసులకు దాచుకున్న రిటైర్మెంట్ సొమ్ములో కొంత భాగాన్ని ఇవ్వటం సంతోషంగా ఫీలవుతూ ఉంటారు. అయితే ఇలా చేయటం వల్ల మత భవిష్యత్తు తెలియకుండానే ఆర్థిక అందకారంలోకి వెళుతోందని వారు గమనించం లేదని మాజీ ఆదాయపు పన్ను అధికారి గిరీష్ అగర్వాల్ చెప్పారు. ప్రస్తుతం అగర్వాల్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ గా ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది భారతీయ తల్లిదండ్రులు చిక్కుకుంటున్న ఆర్థిక ప్రమాదాన్ని హైలైట్ చేస్తూ కళ్లు తెరవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు.

రిటైర్మెంట్ పొందిన ఇండియన్ పేరెంట్స్ యుక్తవయస్సులోని తమ పిల్లలకు డబ్బులు ఇచ్చే ఏటీఎంలుగా మారిపోతున్నారని అగర్వాల్ అన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను గ్రహించకపోవటంతో చాలా మంది రిటైర్డ్ పేరెంట్స్ ఆర్థిక భద్రతను కోల్పోతున్నారని అలర్ట్ చేశారు. ప్రభుత్వ అధికారిగా దశాబ్ధాల పాటు సర్వీస్ పూర్తి చేసుకుని సుమారు రూ.కోటి రిటైర్మెంట్ సొమ్మును పొందుతున్న వానిని వెంటనే.. కొడుకులు, కూతుళ్లు, కోడళ్ల నుంచి ఆ డబ్బు కావాలంటే రిక్వెస్ట్స్ పెరిగిపోవటాన్ని భారతీయ తల్లిదండ్రులకు సర్వసాధారణంగా మారిందన్నారు అగర్వాల్.

ఒక కొడుకు స్టార్టప్ ఆలోచనకు పెట్టుబడికి రిటైర్మెంట్ సొమ్మును వాడాలనుకుంటే.. అతని భార్య ఫ్రాంచైజీ వ్యాపారం కోసం డబ్బులు కోరుతున్నారు దేశంలో. దీంతో పిల్లలపై ప్రేమ, వారి జీవితాలు సెటిల్ అవుతాయనే తాపత్రయంతో రిటైర్డ్ తల్లిదండ్రులు పిల్లల వ్యాపార ఆలోచనలకు డబ్బులు అందిస్తున్నారు. అయితే సరైన ప్లానింగ్ లేకుండా వేస్తున్న ఈ అడుగులతో వారిని తెలియని వ్యాపారాల్లో నష్టాలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఆర్థికంగా సురక్షితంగా ఉన్న పదవీ విరమణ పొందిన తల్లిదండ్రులు అకస్మాత్తుగా తమ కోసం నిర్మించని వ్యాపారంపై ఆదాయం కోసం ఆధారపడాల్సిన పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

రిటైర్మెంట్ సొమ్ములో ఎక్కువ మెుత్తాన్ని పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంతో అనుకోకుండా వారిని ఆర్థిక కష్టాలు వెంటాడటం లేటు వయస్సులో ఆర్థిక భద్రతను కోల్పోయేలా  పడేస్తోందని అగర్వాల్ చెప్పారు. అందుకే తల్లిదండ్రులు తమ సంతానంపై ప్రేమ.. భావోద్వేగంతో చేసే తప్పులు ఆర్థికంగా తప్పుడు మార్గంలో ప్రయాణింపచేస్తోంది. తెలియని వాటిలో పెట్టుబడుల కోసం చేస్తున్న స్వయంకృత నిర్లక్ష్యం చివరి రోజులను చిన్నాభిన్నం చేస్తోందని అగర్వాల్ అన్నారు. అయితే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు మౌనంగా భరిస్తున్న ఆర్థిక ఒత్తిడిని గ్రహించకపోవటం.. రిటైర్డ్ తల్లిదండ్రులను ఆర్థికంగా ఒక టైమ్ బాంబు మీద కూర్చోపెడుతున్నాయి.

అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు రిటైర్మెంట్ సొమ్మును ఇవ్వటానికి బదులుగా మెుదట వారిని ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందటం వైపు నడిపించాలన్నారు. కనీసం 30 ఏళ్ల లోపు ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వాన్ని సంపాదించమనటం ముఖ్యమని అగర్వాల్ సూచిస్తున్నారు. అయితే పిల్లలతో చేసే డబ్బు ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని డాక్యుమెంటేషన్ చేయటంతో పాటు వాటికి రీపేమెంట్ ఏర్పాట్లు కూడా చూసుకోవాలన్నారు. అలాగే పిల్లలకు తమ తల్లిదండ్రులంటే ప్రేమ ఉంటుంది కానీ చేతిలో ఉన్న మెుత్తం డబ్బు వ్యాపారం కోసం ఇవ్వటం వల్ల జీవితంలో ఆర్థికంగా ఏర్పడే ప్రమాదాల గురించి రిటైర్మెంట్ పొందిన పేరెంట్స్ అర్థం అయ్యేలా చెప్పడం కూడా అంతే ముఖ్యమని అగర్వాల్ అన్నారు. తల్లిదండ్రులు గౌరవప్రదంగా జీవించినప్పుడు పిల్లలు కూడా వారికి మర్యాద ఇస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.