కోర్టులోనే ఐఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారిపై కాల్పులు.. చండీగఢ్‌‌లో అల్లుడిని చంపిన మామ

కోర్టులోనే ఐఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారిపై కాల్పులు.. చండీగఢ్‌‌లో అల్లుడిని చంపిన మామ

చండీగఢ్‌‌: పంజాబ్‌‌లోని చండీగఢ్‌‌లో ఇండియన్‌‌ రెవెన్యూ ఆఫీసర్​(ఐఆర్‌‌‌‌ఎస్‌‌)ని కాల్చి చంపారు. శనివారం మధ్యాహ్నం చండీగఢ్‌‌లో కోర్టులో ఈ ఘటన జరిగింది.  ఐఆర్‌‌‌‌ఎస్‌‌ ఆఫీసర్‌‌‌‌ హర్‌‌‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నారు. ఆయన మామ మాల్విందర్‌‌‌‌ సింగ్ సిద్ధూ పంజాబ్‌‌లో ఐజీ.. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌‌లో ఉన్నారు. ఇరు కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఫ్యామిలీ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సెషన్‌‌కు ఇరు కుటుంబాలు హాజరయ్యాయి. కాసేపటి తర్వాత కోర్టు హాలులో నుంచి బాత్రూం కోసం సిద్ధూ బయటకు వచ్చాడు. అదే సమయంలో హర్‌‌‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ కూడా బాత్రూంకు రావడంతో రూమ్‌‌ లోపల ఇద్దరి మధ్య స్వల్ప గొడవ జరిగింది. దీంతో మామ సిద్ధూ.. హర్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో కిందపడ్డ హర్​ప్రీత్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడని బంధువులు తెలిపారు.