చివర్లో స్టాక్ మార్కెట్ డౌన్‌​ .. ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాస్‌

చివర్లో స్టాక్ మార్కెట్ డౌన్‌​ .. ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్ల లాస్‌
  • ఆఖరి గంటలో పడ్డ సెన్సెక్స్, నిఫ్టీ

ముంబై: భారత్​–పాక్​ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ బ్యాంకింగ్, ఎఫ్​ఎంసీజీ  ఆటో షేర్లలో అమ్మకాలు పెరగడంతో గురువారం మార్కెట్లు నష్టపోయాయి. 30-షేర్ల సెన్సెక్స్ 411.97 పాయింట్లు క్షీణించి 80,334.81 వద్ద ముగిసింది. దీనిలోని 23 స్టాక్స్​ నష్టాల్లో ముగిశాయి. సెషన్ మొదటి అర్ధభాగంలో ఇండెక్స్ లాభాల్లోకి వచ్చినా.. వాటిని నిలబెట్టుకోలేకపోయింది.  ఎఫ్​ఎంసీజీ, ఆటో   బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు అధికమవడంతో మధ్యాహ్నం సెషన్‌‌‌‌‌‌‌‌లో ఊపు కోల్పోయింది. ఇన్వెస్టర్ల సంపద గురువారం రూ.5 లక్షల కోట్లు తగ్గింది.   

ప్రీ-క్లోజ్ సెషన్‌‌‌‌‌‌‌‌లో 759.17 పాయింట్లు పతనమై 79,987.61 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఇ నిఫ్టీ 140.60 పాయింట్లు క్షీణించి 24,273.80 వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో 264.2 పాయింట్లు పడిపోయి 24,150.20 వద్ద ముగిసింది.  సెన్సెక్స్ కంపెనీల్లో ఎటర్నల్, ఎం అండ్ ఎం, మారుతి, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్, ఆసియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్,  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుకబడి ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాభపడ్డాయి. 

నష్టాల్లో సెక్టోరల్​ సూచీలు

బీఎస్​ఈ సెక్టోరల్​ ఇండెక్స్​లలో ఐటీ,  బీఎస్ఈ ఫోకస్డ్​ ఐటీ మాత్రమే లాభపడ్డాయి. రియల్టీ 2.60 శాతం, చమురు, గ్యాస్ 1.98 శాతం, ఆటో 1.92 శాతం, విద్యుత్ 1.86 శాతం, యుటిలిటీస్ 1.85 శాతం, కమోడిటీస్​1.67 శాతం, కన్జూమర్​ డిస్క్రెషనరీ 1.58 శాతం, సర్వీసెస్​1.57 శాతం శాతం నష్టపోయాయి. బీఎస్ఈలో 2,548 స్టాక్స్ క్షీణించగా, 1,349 లాభాలను సంపాదించాయి.  ఎఫ్​ఐఐలు బుధవారం రూ. 2,585.86 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ హాంగ్ సెంగ్ సానుకూలంగా ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.