ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశ పరిచిన నిర్మలమ్మ బడ్జెట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్..

ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశ పరిచిన నిర్మలమ్మ బడ్జెట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారు. నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగియగానే దేశీయ స్టాక్ మార్కెట్లు క్షణాల్లో భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఉదయం 12.30 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా పడిపోగా.. నిఫ్టీ సూచీ 690 పాయింట్లకు పైగా నష్టాల్లోకి జారుకుంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 1700 పాయింట్లకు పైగా పతనం కాగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 2300 పాయింట్ల కంటే ఎక్కువ నష్టాలతో ఉంది. 

ఈసారి బడ్జెట్లో ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు, సామాన్య మధ్యతరగతి కోరుకుంటున్న పన్నుల భారం తగ్గింపు లాంటి కీలకమైన ప్రకటనలు ఏమీ లేకపోవటంతో పూర్తిగా పెట్టుబడిదారులు నిరాశకు గురయ్యారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇన్వెస్టర్లకు షాకిచ్చిన నిర్మలమ్మ..
మార్కెట్లలోని పెట్టుబడిదారులను నిరాశకుగురిచేసిన మరో అంశం ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై విధించే STT అదే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ 0.05 శాతానికి పెంచటం పెద్ద షాక్ కి గురిచేసింది. గతంలో ఈ రేటు 0.02 శాతంగా ఉండేది. దీనికి తోడు బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి సంబంధించిన కీలక ప్రకటనలు లేకపోవటం చాలా మంది పెట్టుబడిదారులను నిరాసకు గురిచేసింది.