
Market Closing: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి. ప్రధానంగా సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సూచీలు నష్టాల్లోనే మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అయితే సెంకడ్ హాఫ్ ట్రేడింగ్ సమయంలో మార్కెట్ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యం చేసింది.
వాస్తవానికి భారతీయ స్టాక్ మార్కెట్లు హఠాత్తుగా పెరగటానికి అసలు కారణం దోహా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ తమతో వ్యాణిజ్యానికి సున్నా సుంకాలకు అంగీకరించిందని ప్రకటించటమే. దీంతో దేశీయ ఇన్వెస్టర్లతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి కూడా కొనుగోళ్ల జోరు కొనసాగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల మూడ్ సానుకూలంగా మార్చిందని, ఇది వాణిజ్య యుద్ధం ముగింపుకు దారితీస్తుందనే అభిప్రాయాలు ఇన్వెస్టర్లను ప్రేరేపించాయి.
ఇదే క్రమంలో క్రూడ్ ఆయిల్ ధరల పతనం కూడా మార్కెట్ల పురోగతికి దారితీసింది. రానున్న కాలంలో ఇది దేశంలో ద్రవ్యోల్బణాన్ని మరింతగా అదుపులో ఉంచేందుకు దోహదడనుంది. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర రూ.137 తగ్గిన తర్వాత రూ.5వేల 264 వద్ద కొనసాగుతోంది. ఎక్కువగా ఇంధన అవసరాలకు దిగుమతులపై ఆధారపడే ఇండియాకు ఇది విదేశీ నిల్వలను మిగల్చటంతో పాటు వాణిజ్య లోటును తగ్గించటానికి సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదే క్రమంలో మార్కెట్లలో రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రానున్న ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే ఆశావహంతో దానివల్ల ప్రభావితం అయ్యే అనేర కంపెనీ షేర్లు సానుకూలంగా ట్రేడింగ్ నమోదు చేశాయి. ఈవారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణ, హోల్ సేల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం దీనికి ప్రధాన ఉత్ప్రేరకంగా నిలిచింది.
ALSO READ | LIC Policy: ఈ పాలసీతో చేతికి కోటి రూపాయలు, రోజూ ఎంత దాచుకోవాలో తెలుసా..?
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1200 పాయింట్ల లాభంతో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 395 పాయింట్లు పెరిగింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 554 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 395 పాయింట్లు పెరుగుదలను నమోదు చేశాయి. అలాగే నిన్నటి మార్కెట్ కరెక్షన్ తర్వాత నిఫ్టీ సూచీ 25వేల పాయింట్ల మార్కును తిరిగి క్రాస్ చేసింది. ఈరోజు మార్కెట్ల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.72 లక్షల కోట్లు పెరుగుదలను నమోదు చేసింది.