అసలు ఏం జరుగుతోంది అమెరికాలో.. ఏడాది కాలంలోనే 9 హత్యలు

అసలు ఏం జరుగుతోంది అమెరికాలో.. ఏడాది కాలంలోనే 9 హత్యలు

అమెరికాలో చదువుకొని వస్తా అని చెప్పి వెళ్లిన కన్నవారు కడసారి చూపుకు కూడా నోచుకోకుండా శవపేటికల్లో ఇండియాకు వస్తున్నారు. గత ఏడాది కాలంలోనే అమెరికాలో 9మంది ఇండియన్ స్టూడెంట్స్ పై దాడులు జరిగాయి. మార్చి 11న అభిజిత్ డెడ్ బాడీ ఓ అడవిలో పాతపడిన కారులో దొరికింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వాసి పరుచూరి అభిజిత్(20) అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదవడానికి వెళ్లాడు. పరుచూరి చక్రధర్, శ్రీలక్ష్మిలకు అభిజిత్ ఏకైక సంతానం. చిన్నప్పటి నుండి, అతను తెలివైన విద్యార్థి. ఎవరో అతన్ని హత్య చేశారు. గతేడాది నుంచి అమెరికాలో ఇండయన్ స్టూడెంట్స్ 9 మంది హత్యకు గురైయ్యారు. 

ఎవరు చేశారు, ఎలా చేశారు అనే విషయాలు పూర్తిగా తెలియదు. కానీ ఫ్రెండ్స్ తో ఫైనాషియల్ ప్రాబ్లమ్స్ కారణంగా అభిజిత్ హత్య చేయబడ్డాడని అక్కడి మీడియాలో రాశారు. జనవరిలో ఇండియన్ స్టూడెంట్స్ నీల్ ఆచార్య(19), వివేక్ సైనీ(25) లను మడ్డర్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజాహిర్ అలీపై చికాగోలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇలా తరుచూ భారతీయ విద్యార్థులపై అమెరికాలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. 

ఈ విషయంపై చాలాసార్లు భారత ఎంబస్సీ అమెరికా ప్రభుత్వానికి చెప్పినా సీరియస్ గా తీసుకోలేదు. ఇండియన్ స్టూడెంట్స్ భద్రతపై యూఎస్ గవర్నమెంట్ హామీ ఇస్తున్నా ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. చదువుకునేందుకు ఇండియన్ స్టూడెంట్స్ కు ఇది సేఫ్ ప్లేస్ చేసేందుకు యూస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అక్కడి రాయబారి తెలిపారు. కానీ ఇలాంటి దాడులు నెలకు ఒకటి జరుగుతున్నాయి.