బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు...ఇదేందయ్యా సామీ..  తోకతో పుట్టిన బేబీ..

బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు...ఇదేందయ్యా సామీ..  తోకతో పుట్టిన బేబీ..

ఒక్కోసారి ప్రపంచంలో కొన్ని వింత ఘటనలు, విశేషాలు జరుగుతుంటాయి. వీటిని చూస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కోతి నుండి మనిషి పుట్టాడని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చాలా మంది చదివే ఉంటారు.. అయితే మనుషులకు తోకలు ఉండవు. అయితే చైనాలో తోకతో ఓ చిన్నారి పుట్టింది. నవజాత శిశువుకు 4 అంగుళాల పొడవు తోక కనిపించడంతో వైద్యులు షాక్ అయ్యారు.

ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు  చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

చైనాలోని హాంగ్‌జౌలోని పిల్లల ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు తన వెనుకభాగంలో నాలుగు అంగుళాల తోకను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ అపురూపమైన పాపకు జన్మనిచ్చి ఆస్పత్రి వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరోసర్జరీ డిప్యూటీ చీఫ్ ఫిజిషియన్ డాక్టర్ లీ.. శిశువు పుట్టిన కొద్దిసేపటికే ఈ పరిస్థితిని గుర్తించినట్లు తెలిపారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. 

తోక లాంటి భాగంలో ఎముకలు లేనిది… మృదువైనది, దాదాపు 10 సెం.మీ (3.9 అంగుళాలు) పొడవు ఉందని డాక్టర్ తెలిపారు. శిశువు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందనప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ డా. లీ అన్నారు. వెన్నుపూస చుట్టూ ఉన్న కణజాలాలాలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారితీసే పరిస్థితి ఏర్పడి ఉంటుందని తెలిపారు. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరి లోనూ కనిపించదని చెప్పారు. అయితే ఇలాంటి సమస్యలు వస్తే నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.  మార్చి 11న వీడియో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోకు 34,000 లైక్‌లు మరియు 1,45,000 పైగా షేర్లు వచ్చాయి. శస్త్రచికిత్స ద్వారా తోకను తొలగించాలని చిన్నారి తల్లి నిర్ణయించింది. కానీ స్పెషలిస్ట్ వైద్యులు ఆపరేషన్ చేయడానికి నిరాకరించారు. తోక శిశువు యొక్క నాడీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉన్నందున, దానిని తొలగించడం వలన శిశువుకు జీవితాంతం సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. 

గతంలో కూడా తోకతో జన్మించిన శిశువుల ఉదంతాలు

తోకతో పుట్టిన బిడ్డ ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. నివేదికల ప్రకారం, 2017 వరకు 195 కేసులు నమోదయ్యాయి. 2021లో బ్రెజిల్‌లో, 2022లో మెక్సికోలో తోకతో పుట్టిన ఆడ శిశువు కేసు కూడా నివేదించబడ్డాయి. ఇప్పుడు చైనాలో కూడా అలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదైంది. ఇది వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.