హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్ రేసింగ్ లీగ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రాస్ రేసింగ్ లీగ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ సూపర్‌‌‌‌‌‌‌‌క్రాస్ రేసింగ్ లీగ్ (ఐఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌)కు హైదరాబాద్ తొలిసారి వేదిక కానుంది. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీ బేస్డ్‌‌‌‌‌‌‌‌  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాస్  బైక్ రేసింగ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ అయిన ఈ మెగా లీగ్‌‌‌‌‌‌‌‌లోని రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌ డిసెంబర్ 6,7వ తేదీల్లో గచ్చిబౌలి అథ్లెటిక్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో జరుగుతుందని ఆర్గనైజర్స్ ప్రకటించారు. ఈ లీగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో ఆవిష్కరించారు. ఈ పోటీలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలోని టర్ఫ్‌‌‌‌‌‌‌‌, రన్నింగ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేసి రేస్ నిర్వహిస్తామని ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ కో ఫౌండర్ ఈషన్ లోఖండే చెప్పారు.

ఐఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్ పోటీలు అక్టోబర్–డిసెంబర్‌‌‌‌‌‌‌‌ మధ్య నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పుణెలో అక్టోబర్ 25,26 తేదీల్లో తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌, డిసెంబర్ 6,7న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రెండో రౌండ్ షెడ్యూల్ చేశారు. అదే నెల 20, 21వ తేదీల్లో కేరళలో తర్వాతి రౌండ్ జరుగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  బిగ్‌‌‌‌‌‌‌‌ రాక్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌ టీమ్ కో ఓనర్ ఎన్. గౌతమ్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ట్రెజరర్ సతీష్ గౌడ్ పాల్గొన్నారు.