అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఖలీల్ అహ్మద్

అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఖలీల్ అహ్మద్

భారత జట్టు యువ బౌలర్ ఖలీల్ అహ్మద్ ఆసుపత్రిలో చేరాడు. ఈ మేరకు అతను ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరినట్లు వెల్లడించాడు. క్రికెట్‌కి దూరంగా ఉండడం చాలా కష్టమైన విషయమని, కానీ తప్పడం లేదన్నాడు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని..అందుకే రంజీ ట్రోఫీలో కొన్ని మ్యాచులకు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే కోలుకుని..తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు.. అని ఖలీల్ అహ్మద్ ట్వీట్ లో పేర్కొన్నాడు. 

ఆకట్టుకోని ఖలీల్..

2018లో టీమిండియా తరపున ఆరంగ్రేటం చేసిన ఖలీల్ అహ్మద్..ఇప్పటి వరకు కేవలం 11 వన్డేలు, 14 టీ20లు మాత్రమే ఆడాడు. వన్డేల్లో 15 వికెట్లు, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టులో చోటు కోల్పోయాడు. అటు ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడాడు. మొత్తంగా 34 ఐపీఎల్ మ్యాచుల్లో 48 వికెట్లు దక్కించుకున్నాడు.