చోర్టెన్​ ఎక్కినందుకు ఇండియన్ టూరిస్ట్​ అరెస్ట్

చోర్టెన్​ ఎక్కినందుకు ఇండియన్ టూరిస్ట్​ అరెస్ట్

మంచి టూరిస్ట్​ స్పాట్​కు వెళ్లినప్పుడు ఆ విశేషాలను అడిగి తెలుసుకోవచ్చు. అక్కడ ఫొటోలూ దిగొచ్చు. ఆ విశేషాలే ఒక్కోసారి మనకు చిక్కులు తెచ్చిపెట్టొచ్చు. ఆ ప్రాంతాల్లో ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదో తెలుసుకోకుండా వెళితే జైలుకు వెళ్లాల్సి రావొచ్చు. మహారాష్ట్రకు చెందిన అభిజిత్​ రతన్​ హజారేకి అలాంటి అనుభవమే ఎదురైంది. భూటాన్​ నేషనల్​ మెమోరియల్​ అయిన చోర్టెన్​పైకి ఎక్కి ఫొటో దిగినందుకు అతడిని రాయల్​ భూటాన్​ పోలీసులు (ఆర్​బీపీ) అదుపులోకి తీసుకున్నారు. పాస్​పోర్టును లాక్కునారు.

ఈ ఘటన శుక్రవారం భూటాన్​లోని దౌల్చాలో జరిగింది. బుద్ధుడు సజీవంగా ఉన్నాడని బుద్ధిస్టులు భావించే పవిత్రమైన చోటే ఈ చోర్టెన్​. అలాంటి పవిత్రమైన చోర్టెన్​పైకి ఎక్కడం అక్కడ నేరం. అందుకే పోలీసులు అభిజిత్​ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయ్యేవరకూ దిగిన హోటల్​లోనే ఉండాలని ఆదేశించారు. భూటానీస్​ నేతృత్వంలో వెళ్లిన 15 బైకుల కాన్వాయ్​లో అభిజిత్​ ఓ సభ్యుడు. దౌల్చాలో హాల్ట్​ అయినప్పుడు ఇలా చోర్టెన్​పైకి ఎక్కాడు. అక్కడే చోర్టెన్​కు మరమ్మతులు చేస్తున్న కార్పెంటర్​ జాంభే సాయంతో అతడు దానిపైకి ఎక్కి నిలబడి ఫొటోలకు పోజిచ్చాడు. జాంభే కూడా ఫొటో దిగాడు. పరారీలో ఉన్న జాంభే కోసం పోలీసులు వెతుకుతున్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి