ఉమెన్స్ టీ20: తొలి టీ20లో ఇండియా ఓటమి

ఉమెన్స్ టీ20:  తొలి టీ20లో ఇండియా ఓటమి

నవీ ముంబై: రిచా ఘోష్‌‌‌‌ (20 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36), దీప్తి శర్మ (15 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 36 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించినా.. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇండియాకు ఓటమి తప్పలేదు. టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో బెత్‌‌ మూనీ (57 బాల్స్‌‌లో 16 ఫోర్లతో 89 నాటౌట్‌‌), తాహిలా మెక్‌‌గ్రాత్‌‌ (29 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో) దంచికొట్టడంతో ఆసీస్‌‌ 9 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో కంగారూలు 1–0 లీడ్‌‌లో నిలిచారు. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 172/5 స్కోరు చేసింది. ఓపెనింగ్‌‌లో షెఫాలీ వర్మ (21), స్మృతి మంధాన (28) తొలి వికెట్‌‌కు 28 రన్స్‌‌ జోడించారు.

రొడ్రిగ్స్‌‌ (0) డకౌట్‌‌కాగా, కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ (21), దేవికా వైద్య (25 నాటౌట్‌‌) ఫర్వాలేదనిపించారు. 76 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయిన ఇండియాను రిచా, దీప్తి ఐదో వికెట్‌‌కు 56 రన్స్‌‌ జోడించి ఆదుకున్నారు. ఆసీస్‌‌ బౌలర్లలో ఎలీసా పెర్రీ 2 వికెట్లు తీసింది. తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్‌‌ 18.1 ఓవర్లలో 173/1 స్కోరు చేసి గెలిచింది. మూనీ రెండు కీలక పార్ట్‌‌నర్‌‌షిప్స్‌‌తో ఆకట్టుకుంది. అలీసా హీలీ (37) తొలి వికెట్‌‌కు 73, మెక్‌‌గ్రాత్‌‌తో రెండో వికెట్‌‌కు 100 రన్స్‌‌ జోడించి టీమ్‌‌ను గెలిపించింది. దేవికా ఒక్క వికెట్‌‌ తీసింది. మూనీకి ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.