చెస్ ఒలింపియాడ్లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడో విజయం

చెస్ ఒలింపియాడ్లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఏడో విజయం

చెస్ ఒలింపియాడ్లో భారత మహిళ ఏ జట్టు హవా కొనసాగుతోంది. తాజాగా ఉమెన్స్ A టీమ్  ఆరో సీడ్ అజర్ బైజాన్ను మట్టికరిపించింది. 2.5-1.5 స్కోరు తేడాతో అజర్ బైజాన్ను ఓడించి..వరుసగా ఏడో విజయాన్ని సాధించింది. కోనేరు హంపి మొదటి గేమ్లో ఓడిపోయినా..తానియా సచ్ దేవ్, ఆర్. వైశాలి కష్టపడి తమ గేముల్లో విజయం సాధించారు. పాయింట్ను సాధించేందుకు మరో గేమ్లో ద్రోణివల్లి హారిక కష్టపడి గెలిచింది. 

భారత్ ఉమెన్స్ జట్టులో  ఆర్ వైశాలి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించింది. డ్రా పోజిషన్ నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ..ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేసి తప్పిదాలు చేసేలా చేసింది. చివరకు విజయాన్ని నమోదు చేసింది. డ్రా చేసుకోవాల్సిన గేమ్లో విజయం సాధించడంపై వైశాలి సంతోషం వ్యక్తం చేసింది. 40వ ఎత్తు వరకు ప్రత్యర్థితో సమానంగా ఆటను కొనసాగించానని..అదే సమయంలో డ్రా చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. హంపీ ఓటమితో మరింత ఒత్తిడికి లోనయ్యానని..అయితే ప్రత్యర్థి తప్పిదాలతో తాను గెలవగలనన్న కాన్ఫిడెంట్ వచ్చిందని చెప్పింది. 

అజర్ బైజాన్పై గెలవడం ఆనందంగా ఉందని  ఇండియా A  మెన్స్ టీమ్ కెప్టెన్ అభిజిత్ కుంటే తెలిపాడు. హంపీ ఓడిపోయిన తర్వాత హారిక, వైశాలి, తానియా కొనసాగించిన ఆటతీరు అమోఘమని కొనియాడాడు. 

మరోవైపు ఇండియా A మెన్స్ టీమ్..ఇండియా C టీమ్ను 3-1తో ఓడించింది. మొదటి గేమ్లో అర్జున్  ఎరిగైసి.. అభిజిత్ గుప్తాను ఓడించాడు. ఆ తర్వాత S L నారాయణన్ అభిమన్య పౌరాణిక్‌పై విజయం సాధించాడు. అయితే  పెంటేల హరికృష్ణ, సూర్య శేఖర్ గంగూలీ మధ్య జరిగిన గేమ్ డ్రా అయింది. ఈ సమయంలో SP సేతురామన్.. విదిత్‌పై గెలవడంతో..భారత్ A మెన్స్ టీమ్ భారత C టీమ్పై విక్టరీ నమోదు చేసింది. 


ఇండియా B జట్టు క్యూబాపై గెలిచింది. ఆరో రౌండ్ లో అర్మేనియా చేతిలో ఓడిన ఇండియా బీ టీమ్..ఏడో రౌండ్లో పుంజుకుని క్యూబాపై 3.5--0.-5 స్కోరు తేడాతో గెలిచింది.