లంకపై టీమిండియా సూపర్ విక్టరీ

లంకపై టీమిండియా సూపర్ విక్టరీ

ఆసియాకప్లో భారత మహిళల జట్టు బోణి కొట్టింది. శ్రీలంక మహిళల జట్టుపై 41  పరుగుల తేడాతో విజయం సాధించింది. 151 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక..భారత బౌలర్ల  ధాటికి కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. 

రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ..
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత మహిళల జట్టు.. 20 ఓవర్లలో 6  వికెట్లకు 150 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతీ మంధాన విఫలం కాగా..వన్ డౌన్లో వచ్చిన  జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్తో 76 పరుగులు చేసింది.  కెప్టెన్‌ హర్మన్ ప్రీత్ కౌర్ 33 పరుగులతో రాణించింది. వీరితో పాటు.. దయాలన్  హేమలత 13 రన్స్ చేసింది. ఓ దశలో భారత్  4 ఓవర్లలో రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రోడ్రిగ్స్ , కెప్టెన్ -హర్మన్‌ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 92 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారీ స్కోరు సాధించడంలో టీమిండియా విఫలమైంది. శ్రీలంక బౌలర్లలో రనసింగె 3 వికెట్లు దక్కించుకోగా.. సుగందిక కుమారి, చమరి ఆటపట్టు చెరో వికెట్‌ తీశారు.

దుమ్మురేపిన హేమలత..
151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మహిళ జట్టు..భారత బౌలర్ల ధాటికి కేవలం 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌట్ అయింది. లంక ఓపెనర్ హర్షితా సమరవిక్రమణ 26 పరుగులు చేయగా..మిడిలార్డర్ లో వ చ్చిన హాసిని పెరెరా.. 30 పరగులుతో రాణించింది. ఒషాది రణసింగే 11 పరుగులు చేసింది. మిగతా వారు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో లంక  109 పరుగులకే చేతులెత్తేసింది. భారత బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా...పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది.