ఇస్తాంబుల్ : ఇండియా రెజ్లర్ నిషా దహియా పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది. వరల్డ్ ఒలింపిక్ గేమ్స్ క్వాలిఫయర్ ఈవెంట్‌లో ఫైనల్ చేరుకోవడంతో విమెన్స్ రెజ్లింగ్‌లో ఇండియాకు ఐదో ఒలింపిక్ బెర్తు దక్కింది. శుక్రవారం జరిగిన 68 కేజీ సెమీఫైనల్లో నిషా 8–4 స్కోరుతో అలెగ్జాండ్రా అంఘెల్ (రొమేనియా)ను ఓడించింది.
అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో 7–4తో అడెలా హంజ్లికోవా (చెక్)పై విజయం సాధించింది. కాగా, ఇండియా నుంచి ఐదుగురు మహిళా రెజ్లర్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
