న్యూఢిల్లీ: ఇండియా వుషూ ప్లేయర్ అపర్ణ.. శాండా వరల్డ్ కప్‌లో స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్ 52 కేజీల విభాగం ఫైనల్లో అపర్ణ వరుస సెట్లలో వరల్డ్ చాంపియన్ థీ పువాంగ్ ఎన్గా ఎంగో (వియత్నాం)పై గెలిచింది.
దాంతో 2025 సెప్టెంబర్‌లో బ్రెజిల్‌లో జరిగిన వరల్డ్ వుషూ చాంపియన్‌షిప్ ఫైనల్లో పువాంగ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ టోర్నీలో ఇండియాకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.
