మనవాళ్లు బీఫ్ తినడానికి కారణమేంటో తెలుసా?

మనవాళ్లు బీఫ్ తినడానికి కారణమేంటో తెలుసా?

మన సంప్రదాయం, విలువలు తెలియాలంటే స్కూల్స్‌లో పిల్లలకు భగవద్దీత నేర్పించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. అలా నేర్పకపోవడం వల్లే విదేశాల్లో ఉంటున్న ఇండియన్స్ బీఫ్ తింటున్నారని చెప్పారు. బిహార్‌లోని పాట్నాలో నిన్న ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘మనం పిల్లల్ని మిషనరీ స్కూల్స్‌కు పంపిస్తాం. అక్కడి నుంచి వాళ్లు ఐఐటీల్లో ప్రవేశం పొంది.. ఇంజనీరింగ్ పట్టాలు అందుకుంటున్నారు. ఆ తర్వాత విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. అక్కడ బీఫ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. దీనికి కారణమేంటి అని మనం ప్రశ్నించుకోవాలి. వాళ్లకు మన విలువలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి నేర్పకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. పైగా ఆ తర్వాత పిల్లలు తమని పేరెంట్స్  పట్టించుకోవడం లేదని బాధపడుతుంటారు’’ అని అన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. వీటన్నింటికీ పాఠశాలల్లో భగవద్గీత భోధించడమే పరిష్కారంగా చెప్పారాయన. 100 ఇళ్లలో పదిహేనింటిలోనే హనుమాన్ చాలీసా, మూడు ఇళ్లలో మాత్రమే రామాయణం, భగవద్గీత వంటి పురాణ గ్రంథాలు ఉన్నట్లు ఓ సర్వేలో తేలిందని చెప్పారు. మరి ఇలాంటప్పుడు పిల్లలను ఎలా బ్లేమ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మంచి విలువలు నేర్పే భగద్గీత లాంటివి పిల్లలకు చెప్పకుంటే వాళ్లు అలానే తయారవుతారని అన్నారు.