Technology : పాస్ వర్డ్ లతో పరేషాన్.. మనోళ్లు చాలా వీక్ ఇందులో

Technology : పాస్ వర్డ్ లతో పరేషాన్.. మనోళ్లు చాలా వీక్ ఇందులో

మొబైల్ అన్లాక్ చేయడం దగ్గర నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వరకూ, సోషల్ మీడియా నుంచి ఇతర యూపీఐ లాగిన్స్ వరకూ ప్రతి దగ్గర యూజర్ పాస్వర్డ్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అకౌంట్ కు అంత సెక్యూరిటీ. పవర్ ఫుల్ పాస్వర్డ్ లను పెట్టుకుంటేనే స్మార్ట్ ఫోన్లను, ల్యాప్టాప్ లను సైబర్ అటాక్స్ నుంచి కాపాడుకోవచ్చు. అయితే ఈ మధ్య నార్డ్ పాస్ అనే సెక్యూరిటీ కంపెనీ పాస్ వర్డ్స్ గురించి ఒక సర్వే చేసింది.

 మనదేశంలో యూజర్లు వాడే పాస్వర్డ్స్ ను ఈజీగా క్రాక్ చేయొచ్చని చెప్పింది. అంటే అంత సులభమైన వాటిని సెట్ చేసుకుంటున్నారని అర్థం. వేరే దేశాలతో పోలిస్తే మనదేశం వాళ్లు పాస్వర్డ్ లను పెట్టడంలో వెనుకబడి ఉన్నారట. సోషల్ మీడియా అకౌంట్లకు ఒకే రకమైన, సైబర్ నేరస్తులకు సులువుగా ఉండే పాస్ వర్డ్ లను పెడుతున్నట్లు నార్డ్ పాస్ చెబుతోంది. ఇండియన్స్ వాడుతున్న పాస్వర్డ్ లల్లో 62 శాతం పాస్వర్డ్స్ ను సెకను కంటే తక్కువ టైంలోనే క్రాక్ చేయొచ్చట.

మన వాళ్లు ఎక్కువ వాడే పాస్వర్డ్స్.. 

అయితే మన దేశం వాళ్లు ‘password'  అనేదాన్ని పాస్వర్డ్ సెట్ చేస్తున్నారట. అంతేకాకుండా 12345, 123456, 123456789, 12345678, india123, 1234567890, 1234567, qwerty, abc123.iloveyou వంటి పాస్వర్డ్ లను వాడుతున్నట్లు తెలిపింది. ఈ పాస్వర్డ్ లను సైబర్ నేరస్తులు కేవలం ఒక్క సెకనులో క్రాక్ చేయవచ్చు. కొంతమంది తమ ఫేవరెట్ హీరోహీరోయిన్ల పేర్లను కూడా పాస్వర్డ్స్ గా పెడుతున్నారు నార్డ్ పాస్ చెప్పింది. అకౌంట్లను కాపాడుకోవాలంటే, పాస్వర్డ్ స్ట్రాంగ్ గా ఉండాలి. పాస్వర్డ్ లో కచ్చితంగా ఎనిమిది అక్షరాలు ఉండేలా చూసుకోవాలి. దాంట్లో అప్పర్ కేస్, లోయర్ కేస్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ (!,@,#,
మొదలైనవి) కచ్చితంగా ఉండాలి. టు ఫ్యాక్టర్ అథంటికేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు.

పాస్ వర్డ్ ఎంత స్ట్రాంగ్..

వాడుతున్న పాస్ వర్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే.. password. kaspersky.com లో కి వెళ్లి కనిపించే బాక్స్ లో పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ పాస్ వర్డ్ స్ట్రాంగ్ ఉంటే గ్రీన్ మార్క్ వస్తుంది. పైగా దాన్ని హ్యాక్ చేయడానికి ఎన్నిరోజులు పడుతుందో కూడా చూపిస్తుంది. ఒకవేళ మీది చాలా కామన్ పాస్ వర్డ్ అయుంటే రెడ్ మార్క్ వస్తుంది. ఎలాంటి వివరాలు కూడా రావు.