- 2040 మధ్య నాటికి 700 గిగావాట్లకు
- ఐఈఎస్ఏ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీలకు డిమాండ్ ప్రస్తుతం ఉన్న 28 గిగావాట్స్అవర్స్(జీడబ్ల్యూహెచ్) నుంచి 2040 మధ్య నాటికి 700 గిగావాట్లకు చేరుతుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) రిపోర్ట్ తెలిపింది. హైదరాబాద్‌లో గురువారం మొదలైన ఐబీఎంఎస్సీఎస్ సదస్సులో ఈ వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం.. వికసిత భారత్ విజన్ 2047 సాధనలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయి. 2025లో బ్యాటరీల డిమాండ్ లో ఈవీల వాటా 60 శాతం ఉండగా, 2047 నాటికి అది 77 శాతం వరకు పెరుగుతుంది. బ్యాటరీ తయారీదారులకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తక్కువ ఖర్చు, భద్రత కారణంగా ఎల్ఎఫ్పీ బ్యాటరీలకు డిమాండ్ ఎక్కువగా ఉండనుందని రిపోర్ట్ వివరించింది.
