న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ నుంచి ఇండియన్స్‌ను మన దేశానికి తీసుకొస్తున్న మిషన్‌కు ‘ఆపరేషన్ దేవి శక్తి’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎస్.జై శంకర్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘అఫ్గానిస్తాన్ నుంచి మనవాళ్లను ఇండియాకు తీసుకొచ్చే మిషన్‌కు ‘ఆపరేషన్ దేవి శక్తి’ అని పేరు పెట్టాం. ఆపరేషన్ కొనసాగుతోంది. అలుపెరగని సేవలందిస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎయిర్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ సిబ్బందికి సెల్యూట్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అఫ్గాన్‌ను తాలిబాన్లు ఆక్రమించిన తర్వాతి రోజు 40 మందితో మొదలైన తరలింపు పక్రియలో ఇప్పటి వరకు 800 మందిని దేశానికి తీసుకొచ్చామని మంత్రి చెప్పారు.
