
- ఇంటెల్ ఇండియా రీజియన్ హెడ్ సంతోష్ విశ్వనాథన్
బెంగళూరు: దేశంలో ప్రతి సంవత్సరం 1.5 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు (పీసీలు) అమ్ముడవుతుంటే ఇందులో విద్యార్థుల వాటా చాలా తక్కువగా ఉందని ఇంటెల్ ఇండియా రీజియన్ హెడ్ సంతోష్ విశ్వనాథన్ అన్నారు. బెంగళూరులో జరిగిన విద్యా ఈవెంట్ ‘పాత్‌ఏఐ కా ఫ్యూచర్’లో ఆయన మాట్లాడారు. అమెరికాలో కంప్యూటర్ల సేల్స్‌లో సగం వాటా విద్యార్థులదే ఉందన్నారు. ఇదే ధోరణి చైనా, ఇండోనేషియా దేశాల్లోనూ కనిపిస్తోందని చెప్పారు.
‘‘భారత్‌లో 41.8 కోట్ల విద్యార్థుల జనాభా ఉన్నా, 90శాతం యువతకు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ, కేవలం 9శాతం మందికే పీసీలు ఉన్నాయి. పీసీలు క్రియేటివిటీకి కీలకం” అని ఆయన పేర్కొన్నారు. దేశంలో 57శాతం పాఠశాలల్లోనే పనిచేసే కంప్యూటర్లు ఉండటం వల్ల విద్యార్థులు ఏఐ వంటి స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారని అన్నారు.