కరోనా సంక్షోభంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం

కరోనా సంక్షోభంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నాం

ఆర్థిక వృద్ధి కొనసాగేలా బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. కరోనా సంక్షోభంలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నామన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుంన్నారు.  భారత్  ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమన్నారు. పేద మధ్య తరగతి సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగంగా జరుగుతోందన్నారు. వచ్చే 25 ఏళ్ల పురోగతిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు నిర్మల. వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విద్యుత్ వంట గ్యాస్ ప్రతీ ఇంటికి చేరేలా చేశామన్నారు. పేదలకు మౌలిక సదుపాయాల కల్పనే మా లక్ష్యమన్నారు.  ఆత్మ నిర్భర భారత్ తో రూ.16 లక్షల ఉద్యోగాలు కల్పించానమ్నారు. నేషనల్ హైవేస్ నెట్ వర్క్ ను 25 వేల కి.మీకు పెంచుతామన్నారు. వృద్ధిరేటు 9.2 శాతంగా అంచనా వేశానమ్నారు. 

రానున్న 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్‌ పునాది అన్నారు నిర్మలమ్మ. పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్‌ నాంది అని ఆమె పేర్కొన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతుల కల్పన, తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందన్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌ పరుగు ప్రారంభమైందన్నారు. వచ్చే 25 ఏళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించిందన్నారు. 

ఈ అమృతకాల బడ్జెట్‌ యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోంది. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. నీలాంచల్‌ నిస్పా‌ట్​ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశామన్నారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ రాబోతుందని తెలిపారు కేంద్ర మంత్రి నిర్మల. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ తయారు చేశామన్నారు. ప్రధాని గతిశక్తి యోజన,సమీకృత అభివృద్ధి,అభివృద్ధి ఆధారిత ఉపాధి- ఉద్యోగ కల్పన ఆధారంగా బడ్జెట్ రెడీ చేశామన్నారు. పరిశ్రమలకు ఆర్థిక ఊతంఇస్తామన్నారు.  పీఎం గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌... దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం చేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.