ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఇండియా జీడీపీ

ఆరేళ్ల కనిష్టానికి పడిపోయిన ఇండియా జీడీపీ

న్యూఢిల్లీ : ఊహించినట్లుగానే ఇండియా జీడీపీ సెప్టెంబర్‌‌ క్వార్టర్లో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. తయారీ రంగం బలహీనంగా ఉండటంతోపాటు, ఎగుమతులు తగ్గిపోవడమే జీడీపీ నత్తనడకకి కారణం. సెప్టెం బర్‌‌ 2019 క్వార్టర్లో ఇండియా జీడీపీ 4.5 శాతం మాత్రమే పెరిగినట్లు ప్రభుత్వం విడుదల చేసిన డేటా చెబుతోంది. అంతకు ముందు జనవరిమార్చి 2013 క్వార్టర్లో ఒకసారి జీడీపీ వృద్ధి 4.3 శాతానికి తగ్గిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరపు రెండో క్వార్టర్‌‌కు జీవీఏ కూడా జూన్‌‌ క్వార్టర్లోని 4.9 శాతం నుంచి 4.3 శాతానికి పడిపోయింది. మైనింగ్‌‌, క్వారీయింగ్‌‌ జీవీఏ సెప్టెంబర్‌‌ 2019 క్వార్టర్లో 0.1 శాతంగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఈ రంగంలో 2.2 శాతం ప్రతికూల వృద్ధి రికార్డయింది. ప్రైవేట్‌ ఫైనల్‌‌ కన్సంప్షన్‌‌ ఎక్స్‌‌పెండిచర్‌‌ (పీఎఫ్‌‌సీఈ) అంతకు ముందు ఏడాది రెండో క్వార్టర్లోని రూ. 27.28 లక్షల కోట్ల నుంచి రూ.29.42 లక్షల కోట్లకు చేరింది. ఫిస్కల్‌‌ డెఫిసిట్‌ ఏప్రిల్‌‌–అక్టోబర్‌‌ 2019 కాలంలో రూ. 7.2లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్లో దీనిని రూ. 7.03 లక్షల కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం
టార్గెట్‌ గా పెట్టు కుంది. ఏడాది టార్గెట్‌ ను 7 నెలల్లోనే దాటేసింది. సెప్టెం బర్‌‌ 2018 క్వార్టర్లో జీడీపీ వృద్ధి (రియల్‌‌ టర్మ్స్‌ లో) 7 శాతంగా ఉంది. అప్పటి నుంచి ప్రతీ క్వార్టర్లోనూ ఇదితగ్గుతూనే వచ్చింది.

ఐతే, దేశంలో స్లోడౌన్‌‌ లేదని బుధవారం కూడా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌‌ రాజ్యసభలో వెల్లడించారు.ఆర్థికవృద్ధి రేటు మాత్రమే కొంత నెమ్మదించిందని పేర్కొన్నారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకుంది. ఆర్థిక వృద్ధి పెంచే దిశలో ఆర్‌‌బీఐ పలు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ ఏడాదిలోనే వడ్డీ రేట్లకు135 బేసిస్‌‌ పాయింట్ల మేర ఆర్‌‌బీఐ కోతపెట్టిం ది. డిసెంబర్‌‌ 5 నాటి మానిటరీ పాలసీకమిటీ మీటింగ్లో మరో దఫా వడ్డీ రేట్ల తగ్గింపుఉండొచ్చని అంచనా వేస్తున్నారు.పడిన కోర్ సెక్టార్…ఎనిమిది కోర్ ఇండస్ట్రీస్‌‌‌‌ అవుట్‌ పుట్ కూడా అక్టోబర్ నెలలో 5.8 శాతానికి పడింది. ఎనిమిదిలో ఆరు కోర్ ఇండస్ట్రీస్‌‌ డౌన్‌‌ట్రెండ్‌‌లోనే ఉన్నాయి .