నూకలు, గోధుమల ఎగుమతులకు ఓకే

నూకలు, గోధుమల ఎగుమతులకు ఓకే

న్యూఢిల్లీ :  గోధుమలు, నూకల ఎగుమతులను బ్యాన్‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రభుత్వం కొన్ని దేశాలకు మాత్రం ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. సుమారు 9  లక్షల టన్నుల నూకలు, గోధుమతో చేసే 35 వేల టన్నుల ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను  ఎగుమతి చేసేందుకు నేషనల్ కోపరేటివ్‌‌‌‌‌‌‌‌  ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌సీఈఎల్‌‌‌‌‌‌‌‌) కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వివిధ దేశాలకు ఈ సంస్థ ఎగుమతులు చేపడుతుంది.  గోధుమ ఉత్పత్తుల్లో  15,226 టన్నుల  మైదా లేదా సేమియా, 14,184 టన్నుల గోధుమలు,  5,326 టన్నుల గోధుమ పిండి, 48,804 టన్నుల నూకలను ఈ ఏడాది భూటాన్‌‌‌‌‌‌‌‌కు ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఐదు లక్షల టన్నుల నూకలను సెనెగల్‌‌‌‌‌‌‌‌కు, 50 వేల టన్నులను గాంబియాకు ఇంకో ఆరు నెలల్లో ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. 2 లక్షల టన్నుల నూకలను ఇండోనేషియాకు, లక్ష టన్నులను మాలికి ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేసేందుకు  ఎన్‌‌‌‌‌‌‌‌సీఈఎల్‌‌‌‌‌‌‌‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.