న్యూఢిల్లీ: ఫ్యాక్టరీ ఉత్పత్తి, అమ్మకాలు, కొత్త ఎగుమతి ఆర్డర్లు నెమ్మదించడంతో మనదేశ తయారీ రంగ వృద్ధి సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది. హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్ట్‌లో 57.5 నుంచి సెప్టెంబర్‌లో 56.5కి పడిపోయింది. ఈ ఏడాది జనవరి తరువాత వృద్ధి ఇంతలా బలహీనపడటం ఇదే మొదటిసారి.
పీఎంఐ పరిభాషలో, 50 కంటే ఎక్కువ ప్రింట్ అంటే విస్తరణ అని అర్థం కాగా, 50 కంటే తక్కువ స్కోర్ సంకోచాన్ని సూచిస్తుంది. "ఔట్‌పుట్ కొత్త ఆర్డర్‌లు నెమ్మదిగా పెరిగాయి. కొత్త ఎగుమతి ఆర్డర్లు మార్చి 2023 నుంచి అత్యల్పంగా ఉన్నందున ఎగుమతి డిమాండ్ వృద్ధిలో క్షీణత స్పష్టంగా కనిపించింది" అని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి చెప్పారు.