సోషల్ మీడియాలో వైరల్‌‌..ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లు దాటిందా!

సోషల్ మీడియాలో వైరల్‌‌..ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లు దాటిందా!

న్యూఢిల్లీ : దేశ ఎకానమీ 4 ట్రిలియన్ డాలర్లను దాటిందని తాజాగా  బిలియనీర్ గౌతమ్ అదానీ, ఇద్దరు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవెంద్ర ఫడ్నవిస్‌‌ ఆదివారం పొగడ్తలతో ముంచెత్తారు. కానీ, ప్రభుత్వం నుంచి అఫీషియల్ స్టేట్‌‌మెంట్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. సోషల్ మీడియా పోస్ట్‌‌లకు ఫైనాన్స్ మినిస్ట్రీ, నేషనల్ స్టాటిస్టికల్‌‌ ఆఫీస్‌‌ స్పందించలేదు. కానీ,  ఇండియా ఇంకా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌‌ను అందుకోలేదని టాప్ అధికారులు చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌ డేటా ఆధారంగా వివిధ దేశాల జీడీపీ నెంబర్లను లైవ్‌‌ ట్రాకింగ్‌‌ చేసే వెబ్‌సైట్ల స్క్రీన్‌‌షాట్‌‌లను  చాలా మంది బీజేపీ లీడర్లు పోస్ట్ చేస్తున్నారు.  దేశాల జీడీపీ నెంబర్లను లైవ్ ట్రాకింగ్‌‌  చేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. ‘కంగ్రాట్స్ ఇండియా. ఇంకో  రెండోళ్లలో జపాన్‌‌ జీడీపీ 4.4 ట్రిలియన్ డాలర్లను

జర్మనీ 4.3 ట్రిలియన్ డాలర్లను దాటి గ్లోబల్‌‌గా మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుంది’ అని  గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ఇండియా జీడీపీ 4 ట్రిలియన్ డాలర్లు దాటిందని,  మోదీ నాయకత్వంలోని న్యూ ఇండియా దూసుకుపోతోందని  జల్‌‌ శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్‌‌ ట్వీట్ చేశారు.