
హైదరాబాద్, వెలుగు: భారతదేశపు అతిపెద్ద డయాలసిస్ నెట్‌వర్క్ నెఫ్రోప్లస్ ఉజ్బెకిస్తాన్‌లో నాలుగు పెద్ద డయాలసిస్ కేంద్రాలను నిర్మించడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ. 69.5 కోట్ల ఫైనాన్సింగ్ ప్యాకేజీపై సంతకం చేసింది. విస్తరణ పనుల కోసం కూడా కొంత డబ్బును వాడుతామని తెలిపింది. ఉజ్బెకిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో కలిసి ఈ కేంద్రాలను నిర్వహిస్తుంది. ఈ లావాదేవీలో ఏడీబీ సాధారణ మూలధన వనరుల నుంచి రూ. 41.7 కోట్ల వరకు లోన్ ఉంటుంది ఏడీబీ ద్వారా రూ. 2,780 కోట్ల వరకు లీడింగ్ ఆసియా ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (లీప్) నుంచి లోన్ పొందుతుంది.
తాష్కెంట్ నగరం, రిపబ్లిక్ ఆఫ్ కరకల్పాక్స్తాన్, ఖోరెజ్మ్ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి నిర్వహిస్తుంది. 160 మెషీన్లతో తాష్కెంట్‌లోని డయాలసిస్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద డయాలసిస్ కేంద్రం అవుతుంది. ఈదేశంలోని 1,100 మంది రోగులకు నాణ్యమైన డయాలసిస్ సేవలను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం సెంటర్లను నిర్వహించడానికి ఇది 100శాతం యాజమాన్యంలోని స్థానిక అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా సేవలను అందించడానికి ‘రెన్అష్యూర్’ ప్రోటోకాల్‌లను అమలు చేయాలని భావిస్తోంది. ఉజ్బెకిస్థాన్‌లో ప్రస్తుతం 30,000 మంది రోగులు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు.