నవంబర్‌‌లో తగ్గిన ఎగుమతులు.. 2.83 శాతం తగ్గి 33.9 బిలియన్ డాలర్లకు

నవంబర్‌‌లో తగ్గిన ఎగుమతులు.. 2.83 శాతం తగ్గి 33.9 బిలియన్ డాలర్లకు
  • నవంబర్‌‌లో తగ్గిన ఎగుమతులు
  • 2.83 శాతం తగ్గి 33.9 బిలియన్ డాలర్లకు
  • 20.58 బిలియన్ డాలర్లకు తగ్గిన వాణిజ్య లోటు

న్యూఢిల్లీ : భారతదేశ సరుకుల ఎగుమతులు ఈ ఏడాది నవంబర్‌‌లో 2.83 శాతం తగ్గి  33.90 బిలియన్ డాలర్లకు చేరుకోగా,  వాణిజ్య లోటు  20.58 బిలియన్ డాలర్లకు తగ్గింది.  దిగుమతులు కూడా నవంబర్‌‌లో 4.33 శాతం తగ్గి 54.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన డేటా వెల్లడించింది. మొత్తంగా 2023--–24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–-నవంబర్‌‌లో సరుకుల ఎగుమతులు 6.51 శాతం తగ్గి  278.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 

చమురు దిగుమతులు తగ్గడం వల్ల ఈ ఎనిమిది నెలల కాలంలో దిగుమతులు కూడా 8.67 శాతం తగ్గి 445.15 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2022-–23 ఏప్రిల్–-నవంబర్లో చమురు దిగుమతులు  139.29 బిలియన్ డాలర్ల నుంచి 113.65 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వాణిజ్య లోటు.. అంటే - దిగుమతులు,  ఎగుమతుల మధ్య వ్యత్యాసం - గత ఏడాది ఇదే కాలంలో  189.21 బిలియన్ డాలర్ల నుంచి 166.35 బిలియన్ డాలర్లు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.