చండీగఢ్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలున్న కీలక గ్యాంగ్స్టర్ లఖ్వీందర్‌ను అమెరికా నుంచి భారత్‌కు విజయవంతంగా రప్పించారు. శనివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన వెంటనే హర్యానా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లఖ్వీందర్పై హర్యానా, పంజాబ్‌లో డజనుకుపైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
ఈ నేపథ్యంలో అతడు 2022లో అమెరికాకు పారిపోయి అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించాడు. దీంతో హర్యానా పోలీసుల విజ్ఞప్తితో 2023, 2024లో అతడికి వ్యతిరేకంగా కేంద్రం రెడ్ కార్నర్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఏజెన్సీలతో ఏడాది పాటు సంప్రదింపులు జరిపిన కేంద్రం లఖ్వీందర్‌ను అమెరికా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంది.
ఈ జాయింట్ ఆపరేషన్ ఫలించడంతో శనివారం అతడు భారత్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే హర్యానా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. లఖ్వీందర్‌ను ఇండియాకు రప్పించడం హర్యానా పోలీసులు సాధించిన గొప్ప విజయమని హర్యానా డీజీపీ తెలిపారు.
