ఆసియా వెయిట్‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో నిరుపమా చేజారిన పతకం

ఆసియా వెయిట్‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో నిరుపమా చేజారిన పతకం

జియాంగ్షాన్‌‌‌‌‌‌‌‌(చైనా): ఆసియా వెయిట్‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా లిఫ్టర్ నిరుపమా దేవి కొద్దిలో పతకం చేజార్చుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 64 కిలోల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకం కోల్పోయింది. ఆదివారం జరిగిన పోటీలో తను మొత్తంంగా 206 కేజీల బరువెత్తి నాలుగో స్థానం సాధించింది. మణిపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన 24 ఏండ్ల నిరుపమా స్నాచ్‌‌‌‌‌‌‌‌లో 91 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌‌‌‌‌‌‌‌లో 115 కేజీల బరువు విజయవంతంగా మోసింది.  

అయితే జర్క్‌‌‌‌‌‌‌‌లో 120, 125 కేజీలను క్లియర్ చేయలేకపోయింది. 125 కేజీలు ఎత్తితే సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాకు చెందిన మున్ మిన్-హీ (మొత్తం 214 కేజీ)ను వెనక్కునెట్టి  కాంస్య పతకం గెలిచే అవకాశం ఉండేది. ఈ పోటీలో చైనాకు చెందిన లీ షువాంగ్ 239 కేజీ (స్నాచ్ 105, జర్క్134) లతో స్వర్ణ పతకం అందుకోగా..  ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌ లిఫ్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎల్రీన్ అన్‌‌‌‌‌‌‌‌ 232 కేజీలతో రజతం గెలిచింది. మంగళవారం జరిగే మెన్స్‌‌‌‌‌‌‌‌ 96 కేజీల విభాగంలో దిల్బాగ్ సింగ్ పోటీ పడనున్నాడు.