2025లో పెరిగిన ఫార్మా ఎగుమతులు..నైజీరియా, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు అత్యధికం

2025లో పెరిగిన ఫార్మా ఎగుమతులు..నైజీరియా, బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు అత్యధికం

న్యూఢిల్లీ: భారత ఫార్మా ఎగుమతులు 2025–-26 ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, బ్రెజిల్,  నైజీరియా కొత్త ప్రధాన గమ్యస్థానాలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఎనిమిది నెలల్లో నైజీరియాకు 179 మిలియన్ డాలర్ల విలువైన ఫార్మా  ఎగుమతులు  పెరిగాయి. 

2024లో ఈ దేశానికి సుమారు 449 మిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతులు జరిగాయి.  బ్రెజిల్ కూడా దాదాపు 100 మిలియన్ డాలర్ల పెరుగుదలను నమోదు చేసింది. ఈ దేశాల్లో ఆరోగ్య సేవలు విస్తరిస్తున్నాయని, అక్కడి ప్రభుత్వాలు జనరిక్ మందుల కొనుగోళ్లను భారీగా పెంచాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్‌‌‌‌‌‌‌‌– నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా నుంచి   20.48 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు జరిగాయి.  అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 6.5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఎగుమతుల్లో  అమెరికా వాటా 31 శాతంగా ఉంది.