ఇండియా పరువు తగలబడిపోయింది

ఇండియా పరువు తగలబడిపోయింది

ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లతో ఇండియా పరువు తగలబడి పోయిందని అన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజధాని ఢిల్లీలోనే భారత ప్రతిష్ఠను దెబ్బతీసేలా హింస జరిగిందని అన్నారు. ప్రేమ, సోదరభావం అన్నవి అక్కడ మంటల్లో తగలబడిపోయాయని, ఈ అల్లర్లలో భారత మాత, హిందుస్థాన్ వీటిని కోల్పోయిందని చెప్పారు. ప్రపంచంలో మన దేశానికి ఉన్న విలువ బూడిదపాలైందన్నారు.

గతవారం ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల నిరసనల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన అల్లర్లలో 48 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మంది గాయపడ్డారు. ఈ అల్లర్లు జరిగిన ప్రాంతాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువరు ప్రతిపక్ష ఎంపీలు ఇవాళ సందర్శించారు. బ్రిజ్పూర్ ప్రాంతంలో అల్లరిమూకలు ధ్వంసం చేసిన ఓ స్కూల్‌ సహా పలు ప్రాంతాలను ఈ బృందం పరిశీలించింది. ఆ తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ పాఠశాల భారతదేశ భవిష్యత్తు. విద్వేషం, హింస దీనిని ధ్వసం చేశాయి. హింసతో భారత మాతకు జరిగే మేలు శూన్యం. అందరూ కలిసి మెలిసి పని చేసి దేశాన్ని ముందుకు నడిపించాల్సిన సమయమిది’ అని అన్నారాయన.